కన్ఫమ్.. ఆ సినిమాను కమ్ముల క్యాన్సిల్ చేశాడు

కన్ఫమ్.. ఆ సినిమాను కమ్ముల క్యాన్సిల్ చేశాడు

‘ఫిదా’ తర్వాత ఏడాదికి పైగా విరామం తీసుకుని అందరూ కొత్త వాళ్లతో ఓ సినిమా చేయడానికి సన్నాహలు చేసుకున్నాడు శేఖర్ కమ్ముల. సుదీర్ఘ కసరత్తు తర్వాత గత ఏడాది చివర్లో ఈ సినిమాను మొదలుపెట్టాడు. మధ్యలో షూటింగ్ శరవేగంగా సాగుతున్నట్లు వార్తలొచ్చాయి. ఇక ఆ సినిమా టైటిల్.. తారాగణం.. ఇతర వివరాలు వెల్లడించడమే ఆలస్యం అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా అక్కినేని నాగచైతన్యతో తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు కమ్ముల. ఆల్రెడీ చేస్తున్న సినిమా గురించి ఊసే లేదు. అది రిలీజయ్యాక కమ్ముల తర్వాతి సినిమా మొదలవుతుందని అనుకుంటే అలాంటిదేమీ లేదని తేలింది. ముందు కొత్తవాళ్లతో మొదలుపెట్టిన సినిమా ఔట్ పుట్ నచ్చక దాన్ని కమ్ముల క్యాన్సిల్ చేశాడన్న వార్త బయటికి వచ్చింది. దానిపై కమ్ముల కానీ, నిర్మాత సునీల్ నారంగ్ కానీ ఏమీ మాట్లాడలేదు.

ఇప్పు చడీచప్పుడు లేకుండా చైతూతో సినిమాను మొదలుపెట్టడం ద్వారా ముందు కొత్తవాళ్ల సినిమాను క్యాన్సిల్ చేసిన విషయాన్ని చెప్పకనే చెప్పాడు కమ్ముల. మామూలుగా ఒక సినిమా పూర్తి చేయకుండా ఏ దర్శకుడూ ఇంకో సినిమా మీదికి వెళ్లడు. కమ్ముల ఈ విషయంలో మరింత పర్టికులర్‌గా ఉంటాడు. ఒక సినిమాకు ఇంకో సినిమాకు మధ్య చాలా విరామం కూడా తీసుకుంటాడు. అలాంటిదేమీ లేకుండా హడావుడిగా చైతూతో సినిమాను మొదలుపెట్టాడంటే.. ముందు చేస్తున్న సినిమా మరుగున పడినట్లే అని తేలిపోయింది. ఆ కథనే చైతూ, సాయిపల్లవిలకు తగ్గట్లుగా మార్పులు చేసి కమ్ముల తన కొత్త చిత్రాన్ని తీస్తున్నాడని.. ముందు తీస్తున్న సినిమాలో హీరో డ్యాన్సర్ అయితే.. కొత్త కథతో హీరోయిన్‌ను డ్యాన్సర్‌గా చూపించబోతున్నాడని.. కాబట్టి సాయిపల్లవికి పర్ఫెక్ట్‌గా సూటవుతుందని.. ఆమె ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. గురువారం చిత్ర ప్రారంభోత్సవంలో చైతూతో పాటు సాయిపల్లవి కూడా పాల్గొనడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English