‘గులాబి’ సినిమా రాజశేఖర్ చేస్తే..?

‘గులాబి’ సినిమా రాజశేఖర్ చేస్తే..?

హెడ్డింగ్ చూడగానే చాలా ఇబ్బందికరంగా అనిపించింది కదూ? రాజశేఖర్ ఏంటి.. ‘గులాబి’ సినిమా చేయడం ఏమిటా అని.ఈ సినిమా వచ్చే సమయానికి రాజశేఖర్ ఇమేజ్ ఎలా ఉందో తెలిసిందే. వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ మాస్ ఇమేజ్ తెచ్చుకున్నారాయన. తనకంటూ ఒక ఇమేజ్ వచ్చాక ఆయనెప్పుడూ లవ్ స్టోరీలు చేయలేదు. అలాంటి వాడు యూత్‌ ఫుల్ లవ్ స్టోరీ అయిన ‘గులాబి’ చేస్తే కచ్చితంగా మిస్ ఫైర్ అయ్యేదేమో.

తన ఇమేజ్‌కు సరిపడని ‘బాజీగర్’ను ‘వేటగాడు’గా రీమేక్ చేసి ఎలా దెబ్బ తిన్నాడో తెలిసిందే. అలాంటిది ‘గులాబి’ చిత్రాన్ని రాజశేఖర్‌తో చేయాలనే ఆలోచన చేశాడట ఒక వ్యక్తి. అతనెవరో తెలిస్తే మరింత షాకవడం ఖాయం. ఆ వ్యక్తి.. దువ్వాసి మోహన్. కమెడియన్‌గా చిన్న చిన్న పాత్రలే చేసిన దువ్వాసి మోహన్.. కొన్ని చిన్న చిత్రాల నిర్మాణంలో పాలుపంచుకోవడంతో పాటు.. మరికొన్ని సినిమాలకు ఫైనాన్స్ కూడా చేశాడు.

కృష్ణవంశీ తనకు ‘గులాబి’ కథ చెప్పినపుడు విపరీతంగా నచ్చేశాక ఈ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారా అని వెతుకుతూ దువ్వాసి మోహన్‌ను కలిశాడట జేడీ. ఐతే అతను కథ విని బాగుందని చెప్పి.. రాజశేఖర్ హీరోగా చేస్తే బాగుంటుందని, డబ్బులు పెడతానని అన్నాడట. తాను హీరోగా చేయాలనుకున్న కథకు రాజశేఖర్ హీరో ఏంటి అనుకుని జేడీ వెనక్కి వచ్చేశాడట.

ఆ సమయంలో తన ఇంటిని అమ్మేసి ఆ డబ్బులతో సినిమా తీద్దామని అనుకున్నానని.. ఈ విషయం రామ్ గోపాల్ వర్మకు తెలిసి తిట్టాడని.. తనే సినిమాను నిర్మిస్తానని ముందుకొచ్చాడని జేడీ తాజాగా ఒక టీవీ కార్యక్రమంలో వెల్లడించాడు. నిజానికి ‘గులాబి’ సినిమా విషయంలో కృష్ణవంశీపై వర్మకు నమ్మకం లేదని.. తన జడ్జిమెంట్ మీద నమ్మకంతోనే ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడానికి వచ్చాడని.. నిర్మాణంలో పెద్దగా జోక్యం కూడా చేసుకోలేదని.. ఫస్ట్ కాపీ చూసి ఓకే అన్నాడని జేడీ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English