మహేష్ అభిమానుల్ని కెలికిన ‘కల్కి’దర్శకుడు

మహేష్ అభిమానుల్ని కెలికిన ‘కల్కి’దర్శకుడు

ఈ రోజుల్లో సినిమాల్ని అగ్రెసివ్‌గా ప్రమోట్ చేస్తే తప్ప జనాల దృష్టిని ఆకర్షించే పరిస్థితి కనిపించడం లేదు. ఇందుకోసం అవసరమైతే వివాదాలు కూడా రాజేస్తున్నారు ఫిలిం మేకర్స్. కానీ ఆ వివాదాలు కొన్నిసార్లు ప్లస్సవుతున్నాయి. కొన్నిసార్లు మైనస్ కూడా అవుతున్నాయి. ‘ఫలక్ నుమా దాస్’ హీరో, దర్శకుడు విశ్వక్సేన్.. ఈ చిత్రానికి అగ్రెసివ్ టీజర్, ట్రైలర్ కట్ చేసి జనాల దృష్టిని ఆకర్షించాడు. అవి ఓపెనింగ్స్‌కు పనికొచ్చాయి. కానీ విడుదలకు ముందు, తర్వాత అతను మాట్లాడిన అతి మాటలు నెగెటివ్ అయ్యాయి. అతను ఉద్దేశపూర్వకంగా విజయ్ దేవరకొండ అభిమానుల్ని కెలకడం చేటు చేసింది. ఇప్పుడు మరో యువ దర్శకుడు ఒక ట్వీట్‌తో మహేష్ అభిమానుల్ని రెచ్చగొట్టి వార్తల్లో నిలిచాడు. అతనే.. ప్రశాంత్ వర్మ.‘అ!’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై ఇప్పుడు ‘కల్కి’తో ప్రేక్షకుల తీర్పు కోరుతున్నాడు ప్రశాంత్. ఇంకో రెండు రోజుల్లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా ప్రోమోలు ఆకట్టుకున్నాయి. సినిమాకు క్రేజ్ తెచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్‌లో ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చినట్లుంది. తాజాగా అతను ‘కల్కి’లో రాజశేఖర్ పోలీస్ డ్రెస్ వేసి నాగలి ఎత్తుకున్న లుక్ ఒకటి రిలీజ్ చేశాడు. దానికి జోడించిన వ్యాఖ్యే వివాదాస్పదమైంది. కమర్షియల్ సినిమాల్లో హీరో నాగలి ఎత్తిన పోస్టర్ రిలీజ్ చేయడం తప్పనిసరి అంటూ తల తిరగబడ్డ ఎమోజీ పెట్టాడు. ఐతే ఇటీవలే ‘మహర్షి’ సినిమాలో మహేష్ నాగలి ఎత్తిన పోస్టర్లు హల్ చల్ చేశాయి. దీంతో తమ హీరో సినిమా మీద ప్రశాంత్ కౌంటర్ వేశాడంటూ అతడిని టార్గెట్ చేశారు మహేష్ ఫ్యాన్స్. ఈ తాకిడికి తట్టుకోలేక ప్రశాంత్ తన ఇంటర్వ్యూ వీడియో ఒకటి షేర్ చేసి అందులో ఒక టైమింగ్ దగ్గర చూడమన్నాడు. మీ ఫేవరెట్ హీరో ఎవరని అడిగితే.. మహేష్ బాబు అని సమాధానం ఇచ్చాడతను. తద్వారా మహేష్‌కు తాను అభిమానినని, ఫ్యాన్స్ తనను టార్గెట్ చేయొద్దని చెప్పకనే చెప్పాడు ప్రశాంత్.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English