ఆ రెండు సినిమాల్నీ బ్లయిండ్‌గా ఫాలో అవడమే

ఆ రెండు సినిమాల్నీ బ్లయిండ్‌గా ఫాలో అవడమే

అర్జున్‌ రెడ్డి అనేది బ్లాక్‌బస్టర్‌ మెటీరియల్‌. అది అందరికీ నచ్చాలని లేదు కానీ మాస్‌ని, యూత్‌ని ఉర్రూతలూగించే కంటెంట్‌ అందులో వుంది. అర్జున్‌రెడ్డిని ఇక్కడ ఫ్యామిలీస్‌ ఆదరించలేదు, లేడీస్‌ అంతగా చూడలేదు. అయినా కానీ అంతగా బ్లాక్‌బస్టర్‌ అయిందంటే అది టార్గెట్‌ ఆడియన్స్‌ని బలంగా రీచ్‌ అయింది. హిందీలో రీమేక్‌ చేసిన సందీప్‌ వంగా అక్కడా ఎలాంటి మార్పులు చేయలేదు. ఉన్నది ఉన్నట్టు తీసాడు. ఇదేమి మగ దురహంకారం అంటూ ఫెమినిస్టులు మొత్తుకుంటున్నారు. అయినా కానీ కబీర్‌ సింగ్‌ ప్రతి రోజూ కోట్లు దండుకుంటున్నాడు.

సోమ, మంగళ వారాల్లో కలిపి ఈ చిత్రానికి ముప్పయ్‌ నాలుగు కోట్లు వసూలయ్యాయి. పెద్ద హీరోల సినిమాలకి కూడా అలాంటి వసూళ్లు రావని బాలీవుడ్‌ ట్రేడ్‌ లోకం విస్తుపోతోంది. ఇదే ఊపులో రెండు వందల కోట్లు వసూలు చేస్తాడని కూడా అంటున్నారు. దీంతో తమిళ రీమేక్‌ 'ఆదిత్య వర్మ'పై దృష్టి పడింది. ఇంతకుముందు బాలా తీసిన వెర్షన్‌ని స్క్రాప్‌ చేసేసి మళ్లీ తీసారు. ఈసారి తెలుగులో ఎలా వుందో అదే తీసారు. అర్జున్‌ రెడ్డి, కబీర్‌ సింగ్‌ అంతగా హిట్‌ అవడానికి కారణం వాటి ట్రెయిలర్లు. తెలుగు, హిందీలో అదే ట్రెయిలర్‌ కట్‌ చేసారు. కాబట్టి తమిళంలో ఎలాంటి వెరైటీలకి పోకుండా అదే ట్రెయిలర్‌ కట్‌ చేసి విడుదల చేయాలి. ఎవరు ఏమి అనుకుంటారనే భయం లేకుండా ధైర్యంగా ప్రమోట్‌ చేసుకుంటే విక్రమ్‌ తనయుడు ధృవ్‌ కూడా బ్లాక్‌బస్టర్‌తో జర్నీ స్టార్ట్‌ చేస్తాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English