రజనీ సినిమాకు అంత సీన్ లేదని..

  రజనీ సినిమాకు అంత సీన్ లేదని..

సూపర్ స్టార్ రజనీకాంత్-శంకర్‌ల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన మాగ్నమ్ ఓపస్ ‘2.0’పై భారతీయ ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలు ఫలించలేదు. ఏకంగా రూ.545 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి తీసిన ఈ చిత్రంలో టెక్నికల్‌గా అంత హై స్టాండర్డ్స్ ఏమీ కనిపించలేదు. కథాకథనాలు కూడా బలహీనంగా కనిపించాయి. సినిమాను ఎంతగా పుష్ చేద్దామని చూసినా ఫలితం లేకపోయింది.

ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ.. చివరికిది లాస్ వెంచర్‌గానే మిగిలింది. ఐతే ఇక్కడ వచ్చిన నష్టాన్ని చైనాలో రిలీజ్ చేసి భర్తీ చేసుకోవాలని అనుకున్నారు లైకా ప్రొడక్షన్ వాళ్లు. ఆరు నెలలుగా చైనా రిలీజ్ కోసం సన్నాహాలు చేస్తున్నారు. అక్కడ ఒక పెద్ద డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా సినిమాను ఇప్పటిదాకా ఏ భారతీయ చిత్రం లేని స్థాయిలో రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు.

జులై 12న 56 వేల త్రీడీ స్క్రీన్లలో ‘2.0’ చైనాలో రిలీజ్ కావాల్సింది. కానీ ఇంకో రెండు వారాల్లో రిలీజ్ అనగా ఇప్పుడు ఆ సినిమాకు బ్రేక్ పడినట్లు సమాచారం. జులై 19న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో రిలీజవుతున్న ‘లయన్ కింగ్’ను చైనాలో వారం ముందే రిలీజ్ చేస్తున్నారు. ఆ చిత్రంపై అంచనాలు మామూలుగా లేవు. ‘2.0’ రిలీజ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తి చేశాక డిస్ట్రిబ్యూషన్ సంస్థకు భయం పట్టుకుంది. దాంతో పోటీ పడితే దీనికి పెద్ద దెబ్బ పడటం ఖాయమనుకున్నారు.

‘2.0’కు విపరీతమైన పబ్లిసిటీ చేస్తున్నా ఆశించిన స్థాయిలో బజ్ క్రియేటవ్వలేదు. దీంతో ఈ చిత్రాన్ని వాయిదా వేయాలని నిర్ణయించారు. ‘లయన్ కింగ్’ హడావుడి ముగిశాక మంచి డేట్ చూసుకుని ‘2.0’ను రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు. దీంతో లైకా ప్రొడక్షన్ వాళ్లు నైరాశ్యంలో మునిగిపోయారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English