నాని 'గ్యాంగ్‌లీడర్‌'కి 'ఏజెంట్‌ ఆత్రేయ' దెబ్బ?

నాని 'గ్యాంగ్‌లీడర్‌'కి 'ఏజెంట్‌ ఆత్రేయ' దెబ్బ?

గత శుక్రవారం విడుదలైన 'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ' మంచి విజయాన్ని చవిచూసింది. మిగతా సినిమాలేవీ ప్రేక్షకులని థియేటర్లకి రాబట్టలేకపోయినా, డీసెంట్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా వసూళ్లు పుంజుకున్నాయి. తొలి వారాంతం తర్వాత కూడా స్టడీ వసూళ్లు రాబట్టుకుంటోంది. ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం విజయాన్ని అందుకుంది. ఇదిలావుంటే ఈ చిత్రంలో టచ్‌ చేసిన ఒక పాయింట్‌ నాని నటిస్తోన్న 'గ్యాంగ్‌లీడర్‌'ని చిక్కుల్లో పడేసినట్టు తెలిసింది. 'ఏజెంట్‌ ఆత్రేయ'లో గుర్తు తెలియని శవాలు అంటూ ఒక బ్యాక్‌డ్రాప్‌ వుంది. క్రైమ్‌ చరిత్రలో అదో పెద్ద స్కామ్‌. ఇదే పాయింట్‌ని 'గ్యాంగ్‌లీడర్‌'లోను ఫ్లాష్‌బ్యాక్‌ దృశ్యాల కోసం వాడుకున్నారట. మిగతా కథకి ఏమాత్రం సంబంధం లేకపోయినా కానీ ఈ అంశాన్ని మాత్రం కథకి బేస్‌ చేసుకున్నారట.

ఆ పాయింట్‌ని 'ఏజెంట్‌ ఆత్రేయ'లో డీటెయిల్డ్‌గా చూపించడంతో దానిని మార్చి వేరే విధంగా రాసుకోవాలని విక్రమ్‌కుమార్‌, నాని ఆలోచిస్తున్నారట. ఆగస్టు 30న విడుదలకి సిద్ధమవుతోన్న 'గ్యాంగ్‌లీడర్‌'కి ఈలోగా మార్పులు చేస్తారా లేక విడుదల వాయిదా వేస్తారా అనేది తెలియదు. లేదా చిన్న పాయింటే కాబట్టి అలాగే వుంచేద్దామనుకుంటారా అనేదానిపై కూడా ఇంకా క్లారిటీ లేదు. ఏదేమైనా ఈ చిన్న సినిమా కాస్తా పెద్ద తిమింగలానికే గుటక పడనివ్వకుండా చేస్తోందని ఇండస్ట్రీలో బాగా చర్చించకుంటున్నారు. కాన్సెప్ట్‌ కథలు తీయాలనుకున్నపుడు ఇలాంటి చిక్కులు వచ్చి పడడం మామూలే కనుక ప్లాన్‌ బి కూడా రెడీ చేసుకుని పెట్టుకోవడం ఉత్తమం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English