పవర్‌ స్టార్‌ నుంచి లిటిల్‌ స్టార్స్‌కి పడింది

పవర్‌ స్టార్‌ నుంచి లిటిల్‌ స్టార్స్‌కి పడింది

కీర్తి సురేష్‌ చాలా ఫాస్ట్‌గా పెద్ద దర్శకులు, హీరోల దృష్టిలో పడింది. కెరియర్‌ ఆరంభ దశలోనే అజ్ఞాతవాసిలాంటి భారీ చిత్రంలో నటించింది. అయితే ఆ చిత్రం అంతగా కలిసి రాలేదనుకోండి. ఆ వెంటనే మహానటితో కీర్తి సురేష్‌ నటిగా చాలా కీర్తి గడించింది. మహానటి తర్వాత అంగీకరించే సినిమాల విషయంలో జాగ్రత్త పాటిస్తూ చాలా పెద్ద సినిమాలు వదిలేసుకుంది. మహానటి తర్వాత కూడా అగ్ర హీరోలతో నటించినట్టయితే ఇప్పుడు టాలీవుడ్‌లో నంబర్‌వన్‌ స్థానంలో కీర్తి వుండేది. తాను ఎదురు చూస్తోన్న తరహా కథలు రాకపోవడంతో కీర్తి సురేష్‌ వచ్చిన అవకాశాలతోనే ఇప్పుడు సంతృప్తి పడుతోంది.

నితిన్‌తో రంగ్‌ దేతో పాటు నాగచైతన్యతో బంగార్రాజు చిత్రంలో నటించడానికి కీర్తి అంగీకరించింది. అలాగే రెండు లేడీ ఓరియెంటెడ్‌ సినిమాల్లో నటిస్తోంది. టాప్‌ స్టార్ల సరసన నటించాల్సిన కీర్తి ఇప్పుడు లిటిల్‌ స్టార్స్‌తో అడ్జస్ట్‌ అవ్వాల్సి వస్తోంది. అలాగే అగ్రతారగా వెలిగిన తర్వాత లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేయడం వల్ల ఎక్కువ లాభముంటుంది. కానీ కాస్త ముందుగానే అలాంటి చిత్రాలు చేస్తూ త్వరగా 'ముదురు' ఇమేజ్‌ని మీద వేసుకుంటోంది. మళ్లీ ఇక్కడ్నుంచి మహేష్‌, ప్రభాస్‌ రేంజ్‌కి నిచ్చెన ఎక్కాలంటే మాత్రం కాస్త కష్టమే సుమీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English