రాజశేఖర్ వదిలేశాడా.. వద్దన్నాడా?

రాజశేఖర్ వదిలేశాడా.. వద్దన్నాడా?

హీరోగా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగాడు రాజశేఖర్. 80లు, 90ల్లో ఆయన క్రేజే వేరుగా ఉండేది. రాజశేఖర్ కెరీర్ ఎదుగుదలతో ఆయనకు డబ్బింగ్ చెప్పిన సాయికుమార్‌ది కూడా కీలక పాత్ర. రాజశేఖర్ కెరీర్ ఆరంభం నుంచి మొదలుపెడితే దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆయనకు వాయిస్ ఇచ్చాడు సాయికుమార్.

ఒక దశలో రాజశేఖర్‌ను మించి హీరోగా క్రేజ్ సంపాదించుకున్నా కూడా ఆయనకు డబ్బింగ్ కొనసాగించాడు. చివరికి తనకు కమిట్మెంట్లు పెరగడం, రాజశేఖర్ స్థాయి మరీ పడిపోవడంతో ఆయనకు టాటా చెప్పేశాడు. మధ్యలో వేరే ఎవరితోనో డబ్బింగ్ చెప్పించుకున్నాడు రాజశేఖర్.

ఐతే ఆయన రీఎంట్రీ మూవీ ‘పీఎస్వీ గరుడవేగ’కు మాత్రం మళ్లీ సాయికుమారే వాయిస్ ఇచ్చాడు. అది సినిమాకు ప్లస్ అయింది. జనాలకు అది నోస్టాల్జిక్ ఫీలింగ్ ఇచ్చింది. కానీ వీళ్లిద్దరి రీయూనియన్ ఒక్క సినిమాకే పరిమితం అయిపోయింది. రాజశేఖర్ కొత్త సినిమా ‘కల్కి’లో ఆయనకు సాయికుమార్ వాయిస్ ఇవ్వలేదు.

ఇంతకుముందు రిలీజ్ చేసిన కమర్షియల్ ట్రైలర్, తాజా హానెస్ట్ ట్రైలర్.. ఈ రెండింట్లోనూ కొత్త వాయిస్ వినిపించింది. దీన్ని బట్టి సాయికుమార్‌కు ఈ చిత్రంతో సంబంధం లేనట్లే కనిపిస్తోంది. ఆయనకు దగ్గరగా వాయిస్ ఉన్న వేరే వ్యక్తితో డబ్బింగ్ చెప్పించుకున్నట్లున్నాడు రాజశేఖర్. మరి ఇక సాయికుమార్ అవసరం లేదని రాజశేఖరే ఆయనకు టాటా చెప్పాడా.. లేక సాయికుమారే కుదరదన్నాడా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English