‘కల్కి’ దర్శకుడితో బాలయ్య ప్రయోగం?

‘కల్కి’ దర్శకుడితో బాలయ్య ప్రయోగం?

నందమూరి బాలకృష్ణ అప్పుడప్పడూ షాకింగ్ కాంబినేషన్లలో సినిమాలు చేస్తుంటాడు. క్రిష్ లాంటి దర్శకుడితో ఆయన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా చేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. అలాగే పూరి జగన్నాథ్‌తో ‘పైసా వసూల్’ చేయడమూ ఆశ్చర్యమే. ఇప్పుడు కొంచెం గ్యాప్ తర్వాత బాలయ్య ఇలాంటి షాకే ఇవ్వబోతున్నట్లు సమాచారం. ‘అ!’ లాంటి వైవిధ్యమైన చిత్రంతో దర్శకుడిగా పరిచయమై.. ఆపై సీనియర్ హీరో రాజశేఖర్‌తో ‘కల్కి’ అనే మరో భిన్నమైన థ్రిల్లర్ తీసిన ప్రశాంత్ వర్మతో బాలయ్య జట్టు కట్టబోతున్నాడట. ఈ విషయాన్ని ప్రశాంత్ వర్మే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం.

బాలయ్య కోసం తాను ఒక ప్రయోగాత్మక కథ రాశానని.. ఆయనతో ఆ కథను తెరకెక్కించే అవకాశాలున్నాయని ప్రశాంత్ వెల్లడించాడు. ఐతే బాలయ్య దీనికి ఓకే చెప్పాడా లేదా అన్నది అతను స్పష్టంగా చెప్పలేదు. మామూలుగా చూస్తే బాలయ్య శైలికి.. ప్రశాంత్‌తో సినిమా చేయడం ఊహకందని విషయం. ప్రశాంత్ ధీమాగా ఇంటర్వ్యూలో బాలయ్యతో సినిమా అని చెప్పాడంటే.. ఇద్దరి మధ్య సంప్రదింపులు జరిగే ఉంటాయేమో. మరి దీనిపై బాలయ్య నుంచి ఎప్పుడు ప్రకటన వస్తుందో చూడాలి. ప్రస్తుతం బాలయ్య కె.ఎస్.రవికుమార్‌తో సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించాల్సి ఉంది. మరోవైపు బాల నటుడిగా చాలా సినిమాల్లో నటించి ‘ఓ బేబీ’లో సమంతకు మనవడిగా నటిస్తున్న తేజతో ప్రశాంత్ ఓ సినిమా చేస్తాడని వార్తలొస్తున్నాయి. వీళ్లిద్దరూ ముందు నుంచి మంచి మిత్రులట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English