విజయ్ దేవరకొండ, అతను బార్లో కూర్చుని..

విజయ్ దేవరకొండ, అతను బార్లో కూర్చుని..

జీవితంలో స్థిరపడనపుడు.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నపుడు రోజులు గడవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎదురయ్యే ప్రతి సమస్యా బాధ కలిగిస్తుంది. కానీ జీవితంలో సక్సెస్ సాధించి.. ఆర్థికంగా మంచి స్థితికి చేరుకున్నాక ఒకపప్పుడు పడ్డ కష్టాలే తీపి జ్ఞాపకాలవుతాయి. వాటిని తలుచుకుంటే ఒక పులకింత కలుగుతుంది. తన మిత్రుడు నవీన్ పొలిశెట్టి హీరోగా పరిచయం అయిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రాన్ని తరుణ్ భాస్కర్, అడివి శేష్, శశికిరణ్ తిక్క తదితరులతో కలిసి హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో వీక్షించిన అనంతరం ప్రెస్ మీట్లో పాల్గొన్న సందర్భంగా విజయ్ దేవరకొండ ఇలాగే ఒకప్పటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నాడు. తాను నవీన్ కలిసి థియేటర్ గ్రూప్‌లో ఉన్నపుడు అవకాశాల కోసం ఎలా కష్టపడిందీ, ఆర్థిక ఇబ్బందుల మధ్య ఎలా రోజులు గడిపిందీ అతను వివరించాడు.

విజయ్, నవీన్ కలిసే చాలా సార్లు ఆడిషన్లకు వెళ్లారట. కలిసి నాటకాలు వేశారట. కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరిగి తిరిగి అలసిపోయినట్లు విజయ్ గుర్తు చేసుకున్నాడు. అప్పుడప్పడూ తాను, నవీన్ తదితరులు కలిసి బార్‌కు వెళ్లేవాళ్లమని.. అప్పుడు చేతిలో పెద్దగా డబ్బులుండేవి కావు కాబట్టి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఏ బీర్‌కు ఉందని అడిగి ఆర్డర్ చెప్పేవాళ్లమని అన్నాడు. అలాగే మెను కార్డ్‌లో ఎప్పుడూ తమ కళ్లు ఎడమ వైపు ఉన్న మద్యం, ఫుడ్ ఐటెమ్స్ పేర్ల మీద ఉండేవి కావని.. కుడి వైపు రేట్లు మాత్రమే చూసేవాళ్లమని.. ఏది తక్కువగా ఉంటే దాన్ని ఆర్డర్ చేసేవాళ్లమని కూడా అతను చెప్పాడు.

అప్పట్లో తమ బృందంలో అందరి కంటే నవీనే బెస్ట్ ఆర్టిస్ట్ అని.. తాము ఎప్పుడు కలిసినా అతనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉండేవాడని.. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో అతడికి సక్సెస్ రావడం చాలా ఆనందం కలిగించిందని..  స్పెషల్ టాలెంట్ ఉన్న నవీన్ కోసం ఇక టాలీవుడ్ ఫిలిం మేకర్స్ స్పెషల్ క్యారెక్టర్స రాస్తారని.. అతను ఇంకా మంచి స్థాయికి ఎదుగుతాడని అన్నాడు విజయ్. తన లాంటి ఆర్టిస్టు మరొకరు తెలుగులో మరొకరు లేరని విజయ్ అంటుంటే నవీన్ ఉద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English