రాజశేఖర్ ఓవరాక్షన్‌ను వాళ్లు కట్ చేశారట

రాజశేఖర్ ఓవరాక్షన్‌ను వాళ్లు కట్ చేశారట

‘గరుడవేగ’తో చాలా కాలం తర్వాత హిట్ కొట్టిన రాజశేఖర్.. ఆ తర్వాత సక్సెస్ మీట్లలో చాలా నిజాయితీగా మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. అంతకుముందు ఆయన మీద ఉన్న నెగెటివిటీని తగ్గించాయి. ఈ మధ్య ‘మా’ ఎన్నికల్లో గెలిచినపుడు కూడా రాజశేఖర్ ఇదే తరహాలో మాట్లాడి శభాష్ అనిపించుకున్నాడు. చాలామంది గత వైభవం గురించి చెప్పుకుంటూ తమ పతనం గురించి ప్రస్తావించడానికి ఇష్టపడరు. కానీ రాజశేఖర్ మాత్రం హీరోగా తన మార్కెట్ జీరో అయిపోవడం గురించి కూడా నిజాయితీగా చెప్పుకోవడం అందరినీ ఆకట్టుకుంది. ‘గరుడవేగ’తో వచ్చిన క్రేజ్‌ను సద్వినియోగం చేసుకుంటూ ‘కల్కి’ అనే మరో వైవిధ్యమైన థ్రిల్లర్ చేసి జనాల దృష్టిని ఆకర్షించిన రాజశేఖర్.. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మరోసారి తన మీద తాను సెటైర్లు వేసుకుని ఆశ్చర్యపరిచాడు.

గతంలో తాను చేసిన సినిమాల ప్రభావం వల్ల ఎలాంటి చిత్రంలో అయినా ఓవరాక్షన్ చేయడం అలవాటైందని.. దర్శకులు తనను అలా తయారు చేసి పెట్టారని.. ‘గరుడవేగ’, ‘కల్కి’ సినిమాల్లో కూడా ఇలాగే అతి చేస్తుంటే వాటి దర్శకులు ప్రవీణ్ సత్తారు, ప్రశాంత్ వర్మ తనను కంట్రోల్ చేశారని రాజశేఖర్ చెప్పడం విశేషం. ఓవరాక్షన్ చేయడం బాగా అలవాటైపోవడం వల్ల మధ్యలో కొన్ని సినిమాల్లో తన నటన కామెడీగా మారిందని.. అలాంటి సమయంలో ముందుగా ప్రవీణ్ సత్తారు ‘గరుడవేగ’ సినిమాతో తనను కంట్రోల్ చేశాడని రాజశేఖర్ చెప్పాడు.

తాను అందులో చేసింది సీనియర్ పోలీసాఫర్ పాత్ర కావడంతో.. తాను అతిగా స్పందిస్తుంటే.. అంత సీనియర్ ఆఫీసర్‌కు ఏ విషయం కొత్తగా అనిపించదని.. అతను సాధ్యమైనంత కామ్‌గా ఉండాలని చెప్పి ప్రవీణ్ సత్తారు తన నుంచి సటిల్ యాక్టింగ్ రాబట్టుకున్నట్లు రాజశేఖర్ తెలిపాడు. ఇక ‘కల్కి’ సినిమాలో ఓ సన్నివేశం చేస్తున్నపుడు పక్కనున్న వాడితో గట్టిగా అరుస్తూ ఓవరాక్షన్ చేస్తుంటే.. పక్కనే ఉన్న వ్యక్తితో అంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పి ప్రశాంత్ వర్మ కూడా తనకు బ్రేకులేసినట్లు వెల్లడించాడు రాజశేఖర్. ఈ రోజుల్లో ఇలా తమ మీద తాము సెటైర్లు వేసుకునే హీరోలు ఎంతమంది ఉంటారు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English