మహేష్‌ ఫాన్‌ బాగా డిజప్పాయింట్‌ అయ్యాడు!

మహేష్‌ ఫాన్‌ బాగా డిజప్పాయింట్‌ అయ్యాడు!

'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ' హీరో నవీన్‌ పోలిశెట్టి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. నటుడిగా బ్రేక్‌ కోసం ఎన్నో ఏళ్లు ఎదురు చూసిన నవీన్‌ తన విజయాన్ని తానే 'లిఖించుకున్నాడు'. ఈ చిత్రానికి రచయితగా కూడా పని చేసిన నవీన్‌ హీరోగా తొలి ప్రయత్నంలోనే మంచి విజయం దక్కించుకున్నాడు. యుఎస్‌లో ఈ చిన్న సినిమా లక్షన్నర డాలర్లు ఆర్జించడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. మహేష్‌బాబుకి వీరాభిమాని అయిన నవీన్‌ గతంలో '1 నేనొక్కడినే'లో చిన్న పాత్రలోను కనిపించాడు. కొత్తగా విడుదలైన సినిమా ఏది బాగున్నా కానీ దాని గురించి ట్వీట్‌ చేసి ఎంకరేజ్‌ చేస్తోన్న మహేష్‌ ఇంకా 'ఏజెంట్‌' గురించి ట్వీట్‌ చేయలేదు.

కొత్త సినిమాతో బిజీగా వున్న మహేష్‌కి ఈ చిత్రం చూసే తీరిక దొరికినట్టు లేదు. మహేష్‌ ట్వీట్‌ చేస్తే కలక్షన్లు మరింత పుంజుకుంటాయని నవీన్‌ అతని బృందం ఆశిస్తున్నారు. ఈ చిత్రం గురించి బడా సెలబ్రిటీలు ఎవరూ అంతగా స్పందించకపోయినా కానీ మౌత్‌ టాక్‌తో ఇప్పటికి ఏజెంట్‌ బాగానే వసూలు చేసాడు. థియేట్రికల్‌ కంటే నాన్‌ థియేట్రికల్‌ రైట్స్‌ ద్వారా ఈ చిత్రం ఎక్కువ రాబట్టుకుంటుందని బిజినెస్‌ వర్గాలకి చెందిన వారు చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English