పంబ రేగ్గొడుతోన్న కబీర్‌ సింగ్‌

పంబ రేగ్గొడుతోన్న కబీర్‌ సింగ్‌

కబీర్‌ సింగ్‌ చిత్రాన్ని బాలీవుడ్‌ విమర్శకులు ఏకి పారేసారు. పురుష దురహంకారానికి ప్రతీకగా దీనిని చిత్రీకరించారు. అయితే ప్రేక్షకులు మాత్రం క్రిటిక్స్‌కి మొట్టికాయలు వేస్తూ కబీర్‌ సింగ్‌కి బ్రహ్మరథం పడుతున్నారు. తొలి వారాంతంలో డెబ్బయ్‌ కోట్లకి పైగా నెట్‌ వసూళ్లని రాబట్టుకున్న కబీర్‌ సింగ్‌ సోమవారం అంచనాలని మించిపోయాడు. ఏకంగా పదిహేడున్నర కోట్ల రూపాయల వసూళ్లతో ఇటీవల వచ్చిన భారీ చిత్రాలని కూడా మించిన వసూళ్లు తెచ్చుకున్నాడు. తొలి వారం ముగిసే సరికి వంద కోట్లు వస్తాయని అనుకున్నది కాస్తా మంగళవారంతో ఆ మార్కు దాటిపోతుందని అంటున్నారు. ఇదే ఊపు వచ్చే వారం కూడా కొనసాగుతుంది కనుక కబీర్‌ సింగ్‌ రెండు వందల కోట్ల నెట్‌ వసూళ్లు రాబట్టడం లాంఛనమేనని బాలీవుడ్‌ ట్రేడ్‌ పండితులు ఖచ్చితంగా చెబుతున్నారు.

ఈ చిత్రానికి వున్న ఊపు తొలి వారాంతంతో తగ్గిపోతుందని, అటుపై విమర్శకుల కామెంట్లు పని చేసి సినిమా రేంజ్‌ కట్టడి అవుతుందని అంచనా వేసిన వారున్నారు. కానీ అందరి అంచనాలని తలకిందులు చేస్తూ ఈ ఏడాదిలో బాలీవుడ్‌ నుంచి వచ్చిన భారీ విజయాల సరసన కబీర్‌ సింగ్‌ చేరిపోయాడు. తెలుగులో అర్జున్‌రెడ్డి సాధించిన విజయం కంటే మించిన విజయాన్ని హిందీలో సొంతం చేసుకున్నాడు. విశేషం ఏమిటంటే అర్జున్‌రెడ్డి అదరగొట్టిన నైజాం ఏరియాలో కూడా కబీర్‌సింగ్‌ అద్భుతమైన వసూళ్లు రాబడుతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English