మన జెర్సీ అక్కడ మెరిసిపోతుంది

మన జెర్సీ అక్కడ మెరిసిపోతుంది

అర్జున్‌ రెడ్డి రీమేక్‌ 'కబీర్‌ సింగ్‌' హిందీ ప్రేక్షకులని ఉర్రూతలూగిస్తూ వుండడంతో పేరు గడించిన తెలుగు సినిమాలని రీమేక్‌ చేయడానికి బాలీవుడ్‌ నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఇంతకుముందు మన కమర్షియల్‌ మసాలా చిత్రాల కోసం బాలీవుడ్‌ నిర్మాతలు ఎగబడేవారు. కబీర్‌ సింగ్‌ సక్సెస్‌ తర్వాత మనం తీసిన కథా విలువలు వున్న చిత్రాలపై దృష్టి పెట్టారు. నాని హీరోగా నటించిన జెర్సీ ఎంతగా ప్రశంసలు అందుకున్నది అనేది తెలిసిందే. క్లాస్‌, ఎమోషనల్‌ సినిమా కావడంతో బ్లాక్‌బస్టర్‌ కాలేకపోయింది కానీ బాక్సాఫీస్‌ వద్ద కూడా జెర్సీ విజయాన్ని అందుకుంది.

ఈ చిత్రంలోని కంటెంట్‌, ఎమోషన్స్‌ బాలీవుడ్‌ ఆడియన్స్‌ని కూడా మెప్పిస్తాయనే నమ్మకంతో దీని హక్కులని కరణ్‌ జోహార్‌ సొంతం చేసుకున్నాడు. వేరే దర్శకులు అయితే కథని మార్చేయడానికి ప్రయత్నిస్తారు కనుక ఒరిజినల్‌ తీసిన గౌతమ్‌ తిన్ననూరితోనే ఈ చిత్రం రీమేక్‌ చేయబోతున్నాడు. ఇందులో కథానాయకుడిగా షాహిద్‌ కపూర్‌ నటించే అవకాశాలే ఎక్కువ. ఎమోషన్స్‌ని బాగా పలికించగలగడంతో పాటు మిడిల్‌ ఏజ్డ్‌ క్రికెటర్‌ పాత్రకి షాహిద్‌ సరిగ్గా సరిపోతాడు కనుక అతడిని కన్సిడర్‌ చేస్తున్నారు. మొత్తానికి మన జెర్సీ అక్కడ సరయిన వాళ్ల చేతిలోనే పడింది కనుక ఇక అక్కద ధగధగలాడిపోతుందని ధీమాగా వుండొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English