తమన్నాకి నచ్చింది... అందుకే డబుల్‌ ఇచ్చింది

తమన్నాకి నచ్చింది... అందుకే డబుల్‌ ఇచ్చింది

తమన్నా కెరియర్‌ మునుపటిలా సాగడం లేదు కానీ ఇప్పటికీ ఆమెకి అవకాశాలయితే వస్తున్నాయి. ఫలానా హీరోతోనే నటించాలనే ఆంక్షలు ఏమీ పెట్టుకోకుండా వచ్చిన ఆఫర్లని చేజిక్కించుకుని రెండు చేతులా సంపాదిస్తోంది. సంపాదించిన దానితో తన కోరికలు కూడా తీర్చుకుంటోంది. ముంబయ్‌లోని ఒక బహుళ అంతస్థుల సముదాయంలో తమన్నా ఒక పాత అపార్ట్‌మెంట్‌ని పదహారు కోట్ల రూపాయలకి కొనేసింది. అంతే కాదు మరో రెండు కోట్లు వెచ్చించి తనకి కావాల్సిన రీతిన రెన్నోవేట్‌ చేయిస్తోంది.

ఆ ఏరియాలో పది కోట్ల లోపే కొత్త అపార్ట్‌మెంట్‌ వస్తుందట. కానీ తనకి సీ వ్యూ కావాలని, ఈ అపార్ట్‌మెంట్‌లో వున్న వ్యూ మరెక్కడా లేదని తమన్నా దీనికోసమే ఇంత వెచ్చించిందట. తమన్నా జాగ్రత్తగానే ఖర్చు పెడుతుంది కానీ ఏదైనా నచ్చిందంటే ఇలాగే ఎంతయినా ఇచ్చేసి సొంతం చేసుకుంటుందని ఇండస్ట్రీలో చెబుతుంటారు. ఈ అపార్ట్‌మెంట్‌ విషయంలో ఆమె తన స్టయిల్‌ ఏమిటో మరోసారి చూపించింది. తమన్నాకి ఇప్పటికే హైదరాబాద్‌, చెన్నయ్‌, బెంగళూర్‌, ముంబయ్‌లలో పలు ఇళ్లు, అపార్ట్‌మెంట్లు వున్నాయి. అవి కాకుండా సొంతంగా కొన్ని వ్యాపారాలు కూడా వున్నాయి. కానీ తీరిక సమయంలో సేద తీరడానికి ఈ అపార్ట్‌మెంట్‌ని ఏరి కోరి కొనుక్కుంది. అదండీ సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English