అభిమానులు అలసిపోయారు మహేష్

అభిమానులు అలసిపోయారు మహేష్

సెలబ్రేటింగ్ మహర్షి.. సెలబ్రేటింగ్ మహర్షి అంటూ మహేష్ బాబు గత నెలన్నర రోజుల్లో ఎన్ని ట్వీట్లు వేశాడో.. ఎన్ని వేడుకల్లో పాల్గొన్నాడో అందరూ చూస్తూనే ఉన్నారు. ‘ఒక్కడు’ లాంటి సెన్సేషనల్ మూవీ అందించినపుడు.. ‘పోకిరి’ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చినపుడు.. ‘దూకుడు’ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టినపుడు కూడా మహేష్ ఇంత హంగామా చేసింది లేదు. పోస్టర్ల మీద వేసినట్లుగా ‘మహర్షి’ సినిమాను ‘ఎపిక్ బ్లాక్ బస్టర్’ అనిపించాలని కంకణం కట్టుకున్నట్లుగా కనిపించాడతను. సినిమాను దాదాపుగా థియేటర్ల నుంచి తీసేశాక కూడా మహేష్ హడావుడి ఆగలేదు. యూరప్‌లో పర్యటిస్తూ వ్యక్తిగత ఫొటోలు షేర్ చేస్తూ కూడా ‘సెలబ్రేటింగ్ మహర్షి’ అనే హ్యాష్ ట్యాగ్ జోడించి ఆశ్చర్యపరిచాడు సూపర్ స్టార్.

‘మహర్షి’కి ఆల్రెడీ రెండు సక్సెస్ మీట్ల కూడా జరిగిన సంగతి తెలిసిందే. ముందుగా హైదరాబాద్‌లో టీం అంతా చిన్న స్థాయిలో ఒక సక్సెస్ మీట్ పెట్టింది. తర్వాత విజయవాడలో భారీగా ఫంక్షన్ చేశారు. మధ్యలో సుదర్శన్ థియేటర్లో జరిగిన హంగామా చూస్తే అది కూడా చిన్న స్థాయి సక్సెస్ మీట్ లాగా కనిపించింది. ఐతే ఇన్ని వేడుకల తర్వాత కూడా మహేష్ తగ్గట్లేదు. మళ్లీ 50వ రోజుల వేడుకకు రెడీ అయిపోయాడు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ వేడుక చేయబోతున్నారట. దీనికి ఇండస్ట్రీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా వస్తారట. ఆల్రెడీ రెండు సక్సెస్ మీట్లు అయ్యాక మళ్లీ ఈ వేడుకలేంటా అని అభిమానులే ఆశ్చర్యపోతున్నారు. మహేష్ సంగతేమో కానీ.. ఫ్యాన్స్ అయితే సంబరాలతో అలసిపోయారు. మరి మహేష్ ఎప్పటికి ‘మహర్షి’ని వదులుతాడో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English