పవన్ చేస్తే వస్తాయి కానీ.. తీస్తే వస్తాయా?

పవన్ చేస్తే వస్తాయి కానీ.. తీస్తే వస్తాయా?

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో వచ్చి తీరుతాడంటూ ఫలితాలకు ముందే గుసగుసలు వినిపించాయి. ఎన్నికల్లో జనసేన దారుణంగా బోల్తా కొట్టడంతో ఇక పవన్ రీఎంట్రీ ఖాయం అనే అభిప్రాయానికి వచ్చేశారు చాలామంది. కానీ పవన్ మాత్రం అందుకు అవకాశమే లేదని తేల్చేశాడు. తాను మళ్లీ సినిమాల్లో నటించననే సంకేతాలు ఇచ్చాడు. కానీ పవన్ నిర్మాతగా మాత్రం సినిమాలు తీస్తాడని.. ముందుగా చరణ్‌‌తో అతను సినిమా తీస్తాడని కొన్ని రోజులుగా ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. చరణ్ తర్వాత మిగతా మెగా హీరోలతోనూ పవన్ సినిమాలు ఉంటాయని కూడా అంటున్నారు. తాను తనను నమ్ముకున్న వాళ్లను బతికించాలంటే డబ్బులు కావాలనే.. కాబట్టి ప్రొడ్యూసర్‌గా అయినా సినిమాలు చేస్తానని గతంలో పవన్ ఒకసారి పేర్కొన్న సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం.

ఐతే పవన్ కళ్యాణ్‌క ఉన్న క్రేజ్‌కు ఇప్పుడు హీరోగా నటించినా ఈజీగా 30 కోట్లకు పైగా పారితోషకం అందుతుంది. వీలు చేసుకుని ఒక సినిమాకు రెండు మూడు నెలలు డేట్లు కేటాయిస్తే చాలు. కానీ నిర్మాతగా పవన్ ఏం సంపాదించగలడన్నది సందేహం. టాలీవుడ్లో సక్సెస్ రేట్ గురించి తెలియంది కాదు. పెద్ద పెద్ద నిర్మాతలే హిట్లు కొట్టి ప్రతి సినిమాకూ లాభాలు చేసుకునే పరిస్థితి లేదు. ఒక సినిమాలో వచ్చింది ఇంకో సినిమాలో పోతోంది. పవన్ ఆల్రెడీ నితిన్ హీరోగా ‘ఛల్ మోహన్ రంగ’ సినిమా చేశాడు. దాని వల్ల అతడికి మిగిలిందేమీ లేదు. తనే హీరోగా ఒకప్పటి తన మిత్రుడు శరత్ మరార్‌ను ముందు పెట్టి సినిమాలు ప్రొడ్యూస్ చేయిస్తే.. ముందు లాభాలు చేసుకున్నప్పటికీ బయ్యర్లకు సెటిల్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అలా చెయ్యక బయ్యర్లను ముంచిన నింద మోయాల్సి వచ్చింది.

ఎంతో శ్రద్ధ పెట్టి సినిమాలు తీసే అనుభవజ్ఞులైన ఫుల్ టైం ప్రొడ్యూసర్లకే ఇక్కడ కష్టంగా ఉంటే.. పవన్ వచ్చి నిర్మాతగా ఏం డబ్బులు సంపాదించేస్తాడన్నది సందేహం. ఇలాంటి రిస్కుల కన్నా తనే హీరోగా ఏడాదికి ఒక్క సినిమా చేసుకున్నా చాలు బాగానే వర్కవుటవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English