సైరా.. మెగా అప్‌డేట్ వచ్చేసింది

సైరా.. మెగా అప్‌డేట్ వచ్చేసింది

ఎప్పుడో పది నెలల కిందట ‘సైరా’ ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఆ తర్వాత ఈ చిత్రం వార్తల్లోనే లేదు. సినిమాకు సంబంధించిన ఏ విశేషం బయటికి రాలేదు. ముందు అన్నట్లు దసరాకు ఈ సినిమా వస్తుందా రాదా అని మథనపడిపోతున్నారు మెగా ఫ్యాన్స్. ఐతే వారిలో ఆందోళన తగ్గించే అప్ డేట్ బయటికి వచ్చింది. దాదాపు ఏడాదిన్నర కిందట మొదలైన ‘సైరా’ షూటింగ్.. ఎట్టకేలకు పూర్తయిందట. ఈ మేరకు అధికారిక ప్రకటనే వచ్చేసింది.

‘సైరా’ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు లొకేషన్ నుంచి రెండు ఫొటోలు షేర్ చేస్తూ ‘సైరా’ షూటింగ్ పూర్తయిందని ప్రకటించాడు. ఈ సినిమాకు పని చేయడం గొప్ప అనుభవమని.. ఔట్ పుట్ అద్భుతంగా వచ్చిందని.. డీఐ పనులు కూడా మొదలు పెట్టేశామని రత్నవేలు ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ వెంటనే వైరల్ అయిపోయింది. ‘సైరా’ షూటింగ్ పూర్తయిందన్న సమాచారం మెగా అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. జూన్‌కే షూటింగ్ అయిపోయింది కాబట్టి దసరాకు సినిమా రిలీజవ్వడానికి బాగానే స్కోప్ ఉన్నట్లే లెక్క. ఈ సినిమా స్కేల్ దృష్ట్యా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం బాగానే పట్టొచ్చు. కానీ ప్రణాళిక ప్రకారం పని చేస్తే దసరా సీజన్‌ను అందుకోవడం కష్టమేమీ కాదు. ఇదిలా ఉండగా.. ఆగస్టు 22న చిరు పుట్టిన రోజు కానుకగా ‘సైరా’కు సంబంధించి ఏదో ఒక విశేషాన్ని అభిమానులతో చిత్ర బృందం పంచుకునే అవకాశాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English