హద్దులు దాటిన హరీష్‌ శంకర్‌?

హద్దులు దాటిన హరీష్‌ శంకర్‌?

'వాల్మీకి'గా వరుణ్‌ తేజ్‌ లుక్‌ అయితే అదిరిపోయింది. ఇంతవరకు వెండితెరపై కనిపించని రూపంలో సరికొత్తగా, ఊర మాస్‌గా దర్శనమిస్తున్నాడు కానీ ఈ చిత్రం 'జిగరదండ' అనే తమిళ సినిమాకి రీమేక్‌ అన్నదే కొడుతోంది. అదో క్రైమ్‌ కామెడీ. వరుణ్‌ తేజ్‌ చేస్తోన్న విలన్‌ పాత్ర ఫెరోషియస్‌గా వున్నా కామెడీగా సాగుతుంది. అది డాన్‌ పాత్రే అయినా కానీ అందులో బాబీ సింహా మరీ ఇంత కరకుగా కనిపించలేదు. ఆ పాత్రకి వరుణ్‌ తేజ్‌ని ఒప్పించడం కోసం హరీష్‌ శంకర్‌ చాలా మార్పులు చేసాడని చెబుతున్నారు.

అందుకు తగ్గట్టే ఈ పాత్ర వేషధారణ అదీ చూస్తే మరీ బీహార్‌ వాడిలా కనిపిస్తున్నాడు. వరుణ్‌ తేజ్‌ గెటప్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించాలని, ఈ గెటప్పే ఈ చిత్రానికో ఐడెంటిటీ తెచ్చి పెట్టాలనే ఉద్దేశంతో చేసిన అటెంప్ట్‌లా అనిపిస్తోంది. మరి వరుణ్‌ గెటప్‌ విషయంలో హద్దులు దాటిన హరీష్‌ 'జిగరదండ'కి చేసే మార్పులు వర్కవుట్‌ అవుతాయా? దబాంగ్‌ చిత్రాన్ని పవన్‌కళ్యాణ్‌ ఇమేజ్‌కి తగ్గట్టుగా మలచి 'గబ్బర్‌సింగ్‌'తో బ్లాక్‌బస్టర్‌ సాధించిన హరీష్‌ శంకర్‌కి ఏ స్క్రిప్టుకి ఏ మార్పులు చేయాలనేది బాగానే తెలుసు. కాబట్టి ఈ మార్పులు చూసి కంగారు పడాల్సిన పని లేదనే చెప్పవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English