కృష్ణవంశీ స్క్రిప్టుకి దిల్‌ రాజు జడ్జి

కృష్ణవంశీ స్క్రిప్టుకి దిల్‌ రాజు జడ్జి

ఒకప్పుడు కృష్ణవంశీ చెప్పిందే కథ, తీసిందే సినిమా! క్రియేటివ్‌ డైరెక్టర్‌గా కీర్తి గడించిన దర్శకుడు ఇప్పుడు సక్సెస్‌లు లేక డీలా పడిపోయాడు. గోవిందుడు అందరివాడేలేతో చరణ్‌కి ఒక గుర్తుండిపోయే సినిమా ఇస్తాడనుకుంటే అదీ చేయలేకపోయాడు. ఆ తర్వాత నక్షత్రం అనే పిచ్చి సినిమా తీసి రివ్యూ రైటర్ల చేత ఒకటే నక్షత్రం తెచ్చుకున్నాడు. అప్పట్నుంచీ కనుమరుగైన కృష్ణవంశీ మళ్లీ 'రుద్రాక్ష' అనే చిత్రంతో బౌన్స్‌ బ్యాక్‌ అవ్వాలని చూస్తున్నాడు. లేడీ ఓరియెంటెడ్‌ కథతో బండ్ల గణేష్‌ నిర్మాణంలో ఈ సినిమా చేయడానికి సంకల్పిస్తున్నాడు.

అయితే ఈ చిత్ర కథని సినిమా తీయవచ్చా లేదా అనేది బండ్ల గణేష్‌ ముందుగా దిల్‌ రాజు సలహా అడిగినట్టు చెబుతున్నారు. కృష్ణవంశీ కథ చెబితే విని 'ఫర్వాలేదు తీయవచ్చు' అని దిల్‌ రాజు తీర్పు చెప్పిన తర్వాత దీనిని తీయాలని తలపెట్టినట్టుగా గుసగుసలాడుతున్నారు. ఇంతకుముందు పూర్తయిన సినిమాలని దిల్‌ రాజుకి చూపించి జడ్జిమెంట్‌ అడిగేవారు. ఇప్పుడు స్క్రిప్టు దశలోనే సలహాలిచ్చే నిపుణుడిగా దిల్‌ రాజు అవతరించాడు. మరి దిల్‌ రాజు అప్రూవల్‌ పొందిన ఈ చిత్రంలో నటించడానికి ఏ హీరోయిన్‌ డేట్స్‌ ఇస్తుందో కానీ దీంతో మళ్లీ కృష్ణవంశీ బౌన్స్‌ బ్యాక్‌ అయి గతంలో తీసిన అద్భుతమైన సినిమాలు మరిన్ని అందించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English