సాహో మురిపెం అయిపోయిందా?

సాహో మురిపెం అయిపోయిందా?

ఆగస్టు 15న విడుదల చేయడం ఖాయమని చెబుతోన్న 'సాహో' నిర్మాతలు ఇంతవరకు టీజర్‌ మాత్రమే విడుదల చేసారు. అది కూడా ప్రమోషన్‌ అసలు లేదని ఫాన్స్‌ గగ్గోలు పెడుతోంటే 'డై హార్డ్‌ ఫాన్స్‌' కోసం ఒక టీజర్‌ వదిలారు. మరో నలభై రోజులలో రిలీజ్‌ పెట్టుకుని ఇంతవరకు ఒక్క పాట కూడా రిలీజ్‌ చేయలేదు. సాధారణంగా హిందీ సినిమాలకి పాటలు చాలా ముందుగా విడుదల చేస్తుంటారు. సాహోని అచ్చమైన హిందీ చిత్రంలా కన్సిడర్‌ చేస్తున్నా కానీ ఇంతవరకు పాటల సందడి లేదు.

సంగీత దర్శకుల త్రయం 'శంకర్‌ ఎహసాన్‌ లాయ్‌'తో పేచీ పెట్టుకోవడంతో వాళ్లు పాటలు పూర్తి చేయకుండానే వెళ్లిపోయారు. మరి వారు కంపోజ్‌ చేసిన పాటలలోంచి ఒకటయినా ఇంతవరకు ఎందుకు విడుదల చేయడం లేదో తెలియట్లేదు. మిగతా పాటలు వేరే వాళ్లతో చేయిస్తున్నామని అన్నారు కానీ అవి ఎంత వరకు వచ్చాయనే దానిపై క్లారిటీ లేదు. రిలీజ్‌కి దగ్గర పడుతూ వుండగా అన్ని భాషలలో విడుదలయ్యే సినిమాకి ఇంత వీక్‌ పబ్లిసిటీ ఏమిటంటూ ఫాన్స్‌ గోల చేస్తున్నారు. ఇంకా చిత్రీకరణ బ్యాలెన్స్‌ వుందనే టాక్‌ వినిపిస్తోన్న నేపథ్యంలో విడుదల వాయిదా పడుతుందా అంటూ అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక సాహో బృందం ఊరించడం మానేసి ఊదరగొట్టాల్సిన టైమ్‌ వచ్చేసిందని గ్రహిస్తే మంచిది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English