మెగా హీరోకి ఐడెంటిటీ క్రైసిస్‌!

మెగా హీరోకి ఐడెంటిటీ క్రైసిస్‌!

పేరు మార్చుకునేది వుంటే పరిచయం కాకముందో లేక పరిచయం అయిన కొత్తలోనో మార్చేసుకోవాలి కానీ హీరోగా స్థిరపడిపోయి తన పేరు అందరికీ నోటెడ్‌ అయిపోయిన తర్వాత పేరుని కుదించుకున్నా, గుణించుకున్నా అంటే కుదరదు. అంతగా సరదా వుంటే స్పెల్లింగ్‌లో ఒక రెండు ఎక్స్‌ట్రా ఏలు లేదా బీలు పెట్టుకుంటే ఫరక్‌ పడదు. హిట్లు రావడం లేదనే చింతతో సాయి ధరమ్‌ తేజ్‌ కాస్తా తన పేరుని సాయి తేజ్‌ అని మార్చుకున్నాడు. చిత్రలహరితో ఒక మోస్తరు ఫలితాన్ని అయితే సాధించాడు కానీ సాయి ధరమ్‌ తేజ్‌ పేరుకి వచ్చిన ఢోకా ఏమీ లేదు.

సుప్రీమ్‌, సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌ లాంటి విజయాలు అదే పేరుతో సాధించాడు. తెరపై పేరు కుదించుకుని వేసుకున్నా కానీ సోషల్‌ మీడియాలో మాత్రం తన పేరుని అలాగే వుంచేసాడు. ఇప్పటికీ తనని అంతా 'ఎస్‌డీటీ' అనే సంబోధిస్తుంటారు. ఎలాగో కొత్త పేరుతో ఎవరూ పిలవడం లేదని, ఒకవేళ సాయి తేజ్‌ అన్నా 'అతనెవరు?' అంటున్నారని సాయి ధరమ్‌ తేజ్‌ ఇక తన అసలు పేరుతోనే కొనసాగుతున్నాడు. చిత్రలహరి వరకు స్క్రీన్‌ నేమ్‌ 'సాయి తేజ్‌' అయినా కానీ 'ప్రతిరోజు పండగే' నుంచి మళ్లీ సాయి ధరమ్‌ తేజ్‌గానే కంటిన్యూ అవుతాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English