వసూల్‌ రాజాగా మారిన నితిన్‌

వసూల్‌ రాజాగా మారిన నితిన్‌

నిర్మాతగా మారిన కొత్తలో నితిన్‌కి విజయాలే దక్కాయి కానీ తర్వాత ఘోర పరాజయాలని చవిచూసాడు. అఖిల్‌ని ఇంట్రడ్యూస్‌ చేస్తూ తీసిన 'అఖిల్‌' నిర్మాతగా నితిన్‌ని నష్టాల ఊబిలోకి నెట్టేసింది. ఆ తర్వాత 'ఛల్‌ మోహన్‌ రంగ'కి నిర్మాణ భాగస్వాములుగా పవన్‌కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ పేర్లు వేసుకున్నాడు కానీ ఖర్చంతా తన సంస్థదే. నిర్మాతగా డబ్బులు రాకపోగా, తాను హీరోగా తీసుకునే పారితోషికానికి కూడా ఎసరు పెడుతోందని నితిన్‌ ఇక నిర్మాణం డ్రాప్‌ అయ్యాడు. ఆమధ్య రాక్షసన్‌ అనే తమిళ చిత్రం రైట్స్‌ తీసుకుని మరీ వదిలేసాడు.

ఆ చిత్రాన్నే రాక్షసుడు పేరుతో బెల్లంకొండ శ్రీనివాస్‌ చేస్తున్నాడు. ఇదిలావుంటే వరుసగా మూడు ఘోర పరాజయాల తర్వాత నితిన్‌ ఒకేసారి మూడు సినిమాలు పట్టాలెక్కించాడు. భీష్మ షూటింగ్‌ మొదలు పెట్టి, చంద్రశేఖర్‌ యేలేటి సినిమాకి పూజ నిర్వహించి, వెంకీ అట్లూరి సినిమాకి 'రంగ్‌ దే' అనే టైటిల్‌ ప్రకటించి నితిన్‌ తన పనిలో నిండా మునిగిపోయాడు. నిర్మాతగా వచ్చిన నష్టాలన్నీ భర్తీ చేసుకునేందుకు ఇప్పుడు పారితోషికం మాత్రమే వసూలు చేస్తూ వరుసగా అన్ని సినిమాలూ దార్లో పెట్టేసాడు. ఇకనైనా నిర్మాణానికి దూరంగా వుంటాడో లేక రెండు హిట్లు పడగానే షరా మామూలుగా నిర్మాతగా మారిపోతాడో రెండు హిట్లు పడితే కానీ తెలియదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English