‘ఏజెంట్’ హిట్టయినట్లేనా?

‘ఏజెంట్’ హిట్టయినట్లేనా?

టాలీవుడ్ బాక్సాఫీస్‌లో చాలా రోజులుగా స్లంప్ నడుస్తోంది. ‘మహర్షి’ తర్వాత ఏ చిత్రమూ థియేటర్లను కళకళలాడించలేకపోయింది. నిజానికి ‘మహర్షి’ సైతం అంచనాలకు తగ్గట్లు ఏమీ ఆడలేదు. మహేష్ స్థాయికి తగ్గ సినిమా ఏమీ కాదు. ఐతే వేసవిలో ఈమాత్రం భారీ చిత్రం మరొకటి లేకపోవడంతో జనాలు ఆ చిత్రాన్ని ఓ మోస్తరుగా ఆదరించారు. ఆ సినిమా వచ్చాక తర్వాతి నాలుగు వారాల్లో ఏ చిత్రం కూడా ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. సినిమాలు వచ్చాయి. వెళ్లాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు సైతం బాక్సాఫీస్ దగ్గర నిలవలేకపోయాయి. అందుకు ‘గేమ్ ఓవర్’ ఉదాహరణ. ఇక టాక్ కొంచెం అటు ఇటుగా ఉన్న సినిమాల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. గత వీకెండ్లో ఐదారు సినిమాలు రిలీజవగా.. అందులో రెండు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఒకటి.. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ కాగా.. ఇంకోటి ‘మల్లేశం’.

ఐతే వీటిలో ‘మల్లేశం’ చాలా మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్ సక్సెస్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి వసూళ్లు నిరాశాజనకంగా ఉన్నాయి. బుక్ మై షోలో చూస్తే థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. ఎంత మంచి రివ్యూలు వచ్చినా.. ఎంతగా సినిమాను పుష్ చేసే ప్రయత్నం చేసినా.. ఈ సినిమా పికప్ కావడం లేదు. కాకపోతే లో బడ్జెట్లో తెరకెక్కడం వల్ల ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కుల ద్వారా అయినా నిర్మాతల్ని సేఫ్ జోన్లోకి తీసుకొచ్చే అవకాశముంది. దీంతో పోలిస్తే  ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ పరిస్థితి మెరుగ్గానే ఉంది. దీనికి కూడా వచ్చిన టాక్‌కు తగ్గ వసూళ్లయితే లేవు. కానీ.. ఆక్యుపెన్సీ ఓ మోస్తరుగా కనిపిస్తోంది. ప్రేక్షకులు ఈ సినిమా చూడ్డానికే థియేటర్లకు కదులుతున్నారు. యూత్‌ను ఈ చిత్రం ఆకట్టుకుంటోంది. యుఎస్‌లో ఈ చిత్రం 1.6 లక్షల డాలర్ల దాకా వీకెండ్లోనే వసూలు చేసి ఆల్రెడీ లాభాల బాటలోకి రావడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English