‘అర్జున్ రెడ్డి’ని తీసేశారు.. మరి దీన్నేం చేస్తారు?

‘అర్జున్ రెడ్డి’ని తీసేశారు.. మరి దీన్నేం చేస్తారు?

రెండేళ్ల కిందట తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా.. తమిళ జనాల్ని కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఆ సినిమాను ‘బాహుబలి’ లెవెల్లో విరగబడి చూశారు తమిళ జనాలు. ‘బాహుబలి’ అయినా తమిళంలో చూశారు. కానీ ‘అర్జున్ రెడ్డి’ తెలుగు వెర్షనే చెన్నై సహా తమిళ నగరాల్లో ప్రభంజనం సృష్టించింది. మల్టీప్లెక్సుల్లో తమిళ సినిమాల్ని మించి దీనికి ఎక్కువ షోలు వేశారు. తొలి వారమంతా హౌస్ ఫుల్స్‌తో రన్ అయిందా చిత్రం. తమిళనాట అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా ‘అర్జున్ రెడ్డి’ రికార్డు దిశగా దూసుకెళ్తుండగా.. ఆ చిత్రానికి బ్రేక్ వేశారు. ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి హక్కులు కొన్ని నిర్మాతలు తెలుగు వెర్షన్‌ను తీయించేశారు. దీని పట్ల తమిళ జనాల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇలా హౌస్‌ఫుల్స్‌తో నడుస్తున్న సినిమాను థియేటర్ల నుంచి తీసేయడం అరుదుగా జరిగే విషయం.

ఐతే రెండేళ్లు గడిచాయి. ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ సైతం తమిళనాట అదరగొడుతోంది. హౌస్ ఫుల్స్‌తో రన్ అవుతోంది. ‘అర్జున్ రెడ్డి’ స్థాయిలోనూ ఇది కూడా అక్కడ ప్రభంజనమే సృష్టిస్తోంది. ఇప్పటికే దాదాపు కోటి రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసినట్లుగా ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. అప్పుడైతే తెలుగు నిర్మాతలతో మాట్లాడి ‘అర్జున్ రెడ్డి’ని బలవంతంగా తీసేశారు. అప్పటికి ‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్ మొదలే కాలేదు కాబట్టి దాని విషయంలో క్యూరియాసిటీ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నం. హిందీలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసిన నిర్మాతలతో మాట్లాడి తమిళ వెర్షన్ కోసం దాన్ని తీయించే పరిస్థితి లేదు. పైగా ‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్సన్ పట్ల విపరీతమైన నెగెటివిటీ ఉంది. ఒక వెర్షన్ తీసి చెత్త బుట్టలో వేశాక.. తర్వాతి వెర్షన్ తీసి టీజర్ రిలీజ్ చేస్తే అదే నెగెటివిటీ కనిపిస్తోంది. ఇది కూడా అసలు విడుదలకు నోచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ స్థితిలో హీరో ధ్రువ్, నిర్మాతల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English