తమిళ బిగ్ బాస్‌లో ఒక సెన్సేషన్

తమిళ బిగ్ బాస్‌లో ఒక సెన్సేషన్

తెలుగు ‘బిగ్ బాస్’కు హోస్ట్‌ ఎవరన్నదే సస్పెన్సుగా ఉంది. అక్కినేని నాగార్జునే ఈసారి హోస్ట్‌గా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే కానీ.. అదింకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ తమిళంలో మాత్రం మూడో సీజన్లో కూడా కమల్ హాసనే షోను నడిపించబోతున్నారు. అక్కడ మూడో సీజన్ మొదలైపోతోంది కూడా. పార్టిసిపెంట్లను అధికారికంగా ప్రకటించడానికి ముందే సోషల్ మీడియాలోకి జాబితా వచ్చేసింది.

దాదాపుగా ఆ లిస్టే ఖరారవుతుందని అంటున్నారు. పార్టిసిపెంట్లలో ఒక సెన్సేషనల్ పేరుండటం విశేషం. అదే.. చేరన్. సెన్సేషన్ అంటే ఆయనేమీ వివాదాస్పద వ్యక్తి కాదు. దూకుడుగానూ ఉండరు. కానీ ఆయన నేపథ్యం, స్థాయి, మనస్తత్వం ప్రకారం చూస్తే ‘బిగ్ బాస్’ షోలో పాల్గొనడం ఆశ్చర్యకరమే.

‘నా ఆటోగ్రాఫ్’ తమిళ వెర్షన్‌తో ఒకప్పుడు చేరన్ పేరు దక్షిణాదిన మార్మోగిపోయింది. అప్పటికే నటుడిగా, దర్శకుడిగా మంచి పేరున్న చేరన్.. ఈ సినిమాతో ఎక్కడికో వెళ్లిపోయాడు. కోలీవుడ్లో ఇదొక కల్ట్ పిలిం‌గా నిలిచిపోయింది. ఆ తర్వాత కూడా కొన్ని అద్భుతమైన చిత్రాలు అందించి గొప్ప పేరు సంపాదించాడు చేరన్. కోలీవుడ్లో ఆయన్ని ఒక లెజెండ్ లాగే చూస్తారు. మామూలుగా బిగ్ బాస్‌కు వచ్చే వాళ్లతో పోలిస్తే ఆయన స్థాయి చాలా ఎక్కువ. లైమ్ లైట్లో లేని వాళ్లు, పెద్దగా సక్సెస్ కాని వాళ్లు.. చిన్న స్థాయి నటీనటులే ‘బిగ్ బాస్’లో పాల్గొంటూ ఉంటారు.

కానీ చేరన్ స్థాయి వ్యక్తి ఈ షోకు రావడం షాకింగే. మరి ఆయన ఆసక్తి ఏంటో చూడాలి. కచ్చితంగా ‘బిగ్ బాస్’ హౌస్‌లో చేరన్ ప్రత్యేకంగా కనిపిస్తాడనడంలో సందేహం లేదు. చేరన్‌తో పాటు ‘పవర్ స్టార్’గా పేరున్న శ్రీనివాసన్, క్యారెక్టర్ నటి ఫాతిమా బాలు తదితరులు ఈసారి ‘బిగ్ బాస్’ పార్టిసిపెంట్ల జాబితాలో ఉన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English