కలెక్షన్ల ఊచకోత... క్రిటిక్స్‌కి చెంపదెబ్బ!

కలెక్షన్ల ఊచకోత... క్రిటిక్స్‌కి చెంపదెబ్బ!

బాలీవుడ్‌ క్రిటిక్స్‌లో డెబ్బయ్‌ శాతం మంది 'కబీర్‌ సింగ్‌'ని పురుషాహంకారానికి ప్రతీకగా, స్త్రీ చైతన్యాన్ని అణచివేసే ప్రమాద సూచికగా చిత్రీకరించారు. కొందరయితే ఇలాంటి సినిమాలు వస్తున్నందుకు సభ్య సమాజం సిగ్గుతో చచ్చిపోవాలంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చారు. ఇంతకీ ఈ కబీర్‌ సింగ్‌ మరేమిటో కాదు... అర్జున్‌ రెడ్డి రీమేక్‌. తెలుగులో ఈ సినిమా తీసిన సందీప్‌ రెడ్డి హిందీలోను దీనిని తెరకెక్కించాడు.

అర్జున్‌ రెడ్డిని అమితంగా ప్రేమించిన సందీప్‌ రెడ్డి హిందీ రీమేక్‌లో సీన్‌ కూడా మార్చకుండా ఫ్రేమ్‌ టు ఫ్రేమ్‌ మళ్లీ తీసాడు. ఈసారి బడ్జెట్‌ ఎక్కువ దొరికింది కాబట్టి అదే సినిమాని ఇంకాస్త క్వాలిటీతో తీసాడు. తెలుగులో బ్లాక్‌బస్టర్‌ అయి, తెలుగు సినిమా పురోగతిని సూచించిన సినిమాల్లో ఒకటి అయిన అదే సినిమాపై హిందీ వాళ్లకి ఎందుకింత అక్కసు? హీరో పాత్రలోని నెగెటివ్‌ లక్షణాల చుట్టూనే ఈ కథని సందీప్‌ అల్లుకున్నాడు. సగటు గుడ్‌బాయ్‌ లవ్‌లో పడడం కాకుండా, ఒక బ్యాడ్‌ బాయ్‌ సిన్సియర్‌గా లవ్‌లో పడితే ఎలా వుంటుంది అనేది చూపించాడు.

హీరోయిన్‌ని మరీ మెత్తగా చూపించాడనేది దీనిపై వున్న కంప్లయింటే కానీ కొందరు అమ్మాయిలు నిజంగా అలాగే వుంటారనేది తెలిసిన సంగతే కనుక అదేమంత కాంట్రవర్సీ కాదు. కథని కథలా చూడకుండా, తమకి నచ్చిన ఐడియాలజీని చూపించలేదని కబీర్‌ సింగ్‌ని ఏకి పారేయడం భావ్యం కాదు. సినిమాకి క్రేజ్‌ వుంది కాబట్టి సరిపోయింది కానీ ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన సినిమా అయితే ఈ రివ్యూలకి సాంతం చచ్చిపోయేది. కానీ కబీర్‌ సింగ్‌ విమర్శలని ఖాతరు చేయకుండా బాక్సాఫీస్‌ వద్ద ఊచకోత సృష్టిస్తోంది. మొదటి వారాంతంలో దాదాపు డెబ్బయ్‌ కోట్ల నెట్‌ వసూళ్లతో క్రిటిక్స్‌కి గాట్టి లెంపకాయ కొట్టింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English