పది కోట్లకి తగ్గనంటోన్న బోయపాటి!

 పది కోట్లకి తగ్గనంటోన్న బోయపాటి!

బాలకృష్ణతో బోయపాటి సినిమా అంటే మాస్‌ విపరీతంగా ఎగబడతారు. సింహా, లెజెండ్‌ తర్వాత ఈ కాంబినేషన్‌లో సినిమా అంటే అభిమానులు వేల అంచనాలు పెట్టుకుంటారు. కానీ ఎప్పట్నుంచో డిస్కషన్స్‌లో వున్న ఈ కాంబినేషన్‌లోని హ్యాట్రిక్‌ సినిమా ఎందుకు పట్టాలెక్కడం లేదు?

ఎన్టీఆర్‌ బయోపిక్‌ నిరాశ పరిచిన తర్వాత బోయపాటితోనే సినిమా చేయాలని బాలకృష్ణ భావించారు. అయితే బోయపాటి సమయానికి కథ సిద్ధం చేయలేదు. అంతే కాకుండా బోయపాటి చెప్పిన బడ్జెట్‌ సబబు అనిపించలేదు. దాంతో ఆ చిత్రాన్ని నిర్మించాలని అనుకున్న బాలకృష్ణ కేవలం నటిస్తానని మాత్రం చెప్పడంతో నిర్మాతని తెచ్చే పని బోయపాటి తన భుజానికి ఎత్తుకున్నాడు.

అయితే డెబ్బయ్‌ కోట్లు పెట్టమని అడుగుతోన్న బోయపాటికి నిర్మాతలు దొరకడం లేదు. 'వినయ విధేయ రామ' తర్వాత బోయపాటి శ్రీనుపై బయ్యర్లు అంత నమ్మకం ఉంచుతారనే నమ్మకం వారికి లేదు. అయితే ఈ డెబ్బయ్‌ కోట్ల బడ్జెట్‌లో బోయపాటి తనకోసం 'రాసుకున్న' ఖర్చు పది కోట్లు! డైరెక్టర్‌ రెమ్యూనరేషన్‌లో పది కోట్లు రాసుకుని, బడ్జెట్‌ తగ్గించమంటే ఇంతకంటే తగ్గించే అవకాశం ఎక్కడా లేదని అంటున్నాడని చెప్పుకుంటున్నారు. 'వినయ విధేయ రామ' హిట్‌ అయి వుంటే తన పారితోషికం ఎంత రాసుకునేవాడోనని కూడా నవ్వుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English