విశాల్‌కు రజనీ ఓటు కూడా పడలేదు

విశాల్‌కు రజనీ ఓటు కూడా పడలేదు

గత పర్యాయం నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ నాయకత్వంలోని ప్యానెల్ తిరుగులేని విజయం సాధించింది. అప్పుడు ఇండస్ట్రీలో మెజారిటీ జనాలు విశాల్ వర్గం వైపే నిలిచారు. శరత్ కుమార్ లాంటి దిగ్గజాన్ని ఢీకొట్టి ఎన్నికల్లో ఘనవిజయం సాధించాడు విశాల్.

విశాల్ కార్యవర్గం నుంచి నడిగర్ సంఘం అధ్యక్షుడు అయింది నాజర్ అయినప్పటికీ.. ముందుండి నడిపించింది విశాలే. అప్పుడు విశాల్ వర్గానికి సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ తదితరులు అండగా నిలిచారు. కానీ ఈసారి పరిస్థితి విశాల్ వర్గానికి ఏమంత అనుకూలంగా కనిపించడం లేదు. ఆదివారం నాటకీయ పరిణామాల మధ్య నడిగర్ సంఘం ఎన్నికలు నిర్వహిస్తుండగా.. ఈసారి విశాల్ టీంకు గెలుపు కష్టమే అంటున్నారు.

ఎన్నికల హంగామా మొదలైనప్పటి నుంచి ఇండస్ట్రీలో అనేకమంది విశాల్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఆల్రెడీ విశాల్ టీంలోని కొందరు అతడికి వ్యతిరేకంగా మారారు. తెలుగువాడైన విశాల్ నడిగర్ సంఘంలో, నిర్మాతల మండలిలో సాగించిన ఆధిపత్యం నచ్చక తమిళ ఇండస్ట్రీ పెద్దలు అసూయ చెందారు. వాళ్లంతా ఏకతాటిపైకి వచ్చి ప్రాంతీయ భావాలు రెచ్చగొట్టి విశాల్‌ను ఓడించాలని కంకణం కట్టుకున్నారు. గత కొన్ని రోజుల పరిణామాలు గమనిస్తే విశాల్‌కు ఈసారి గెలుపు అంత తేలిక కాదనిపిస్తోంది.

గత పర్యాయం ఎన్నికల సందర్భంగా విశాల్ టీంకు మద్దతుగా నిలిచిన సూపర్ స్టార్ రజనీకాంత్.. అసలీసారి చెన్నైలోనే లేరు. తన సినిమా ‘దర్బార్’ షూటింగ్‌ కోసం ఆయన ముంబయిలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా ఆయన ఓటు వేసే అవకాశం లేకపోయింది. రజనీ ఇక్కడే ఉంటే ఆయన ఓటుతో పాటు కొన్ని అదనపు ఓట్లు కూడా విశాల్ టీంకు పడేవి. ఆ సానుకూలతను వాళ్లు కోల్పోయారు. ఇంత ప్రతికూలత మధ్య విశాల్ టీం విజయం సాధించిందంటే గొప్పే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English