దేవరకొండకు బిగ్ టెస్ట్.. డేట్ ఫిక్సయింది

 దేవరకొండకు బిగ్ టెస్ట్.. డేట్ ఫిక్సయింది

ఆనంద్ దేవరకొండ తమ్ముడు ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్. ఐతే అన్న విజయ్ దేవరకొండలా అతనేమీ సెన్సేషన్ క్రియేట్ చేయలేదు. ఫాలోయింగ్ సంపాదించుకోలేదు. ఆనంద్ హీరోగా పరిచయం అవుతున్న ‘దొరసాని’ సినిమాకు సంబంధించిన ప్రోమోల్లో అతడి లుక్స్ చూసి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు జనాలు.

ఎంత విజయ్ తమ్ముడైతే మాత్రం హీరో అయిపోతాడా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ‘దొరసాని’ ఫస్ట్ లుక్ లాంచ్ అయినప్పటి నుంచి అతను ట్రోలింగ్ ఎదుర్కొంటూనే ఉన్నాడు. అది రోజు రోజుకూ పెరుగుతోంది కూడా. ఐతే సినిమాలో తన పెర్ఫామెన్స్‌తో ఈ విమర్శలకు సమాధానం చెబుతాననే ధీమాతో ఉన్నాడతను.

అతను సమాధానం చెప్పడానికి ముహూర్తం కుదిరింది. ‘దొరసాని’ జులై 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చేశారు. జులై 12న రామ్-పూరి జగన్నాథ్‌ల ‘ఇస్మార్ట్ శంకర్’ రావాల్సింది. కానీ జులై 14న ప్రపంచకప్ ఫైనల్ ఉందన్న కారణంతో ఆ చిత్రాన్ని వాయిదా వేసుకున్నారు.  ఆ తేదీకి ‘దొరసాని’ బెర్తు బుక్ చేసుకుంది. ఆనంద్‌తో పాటు హీరోయిన్ శివాత్మిక (రాజశేఖర్ రెండో కూతురు)కు కూడా ‘దొరసాని’ పరీక్షే.

ఆమె కూడా కొంత వ్యతిరేకత ఎదుర్కొంటోంది. మహేంద్ర అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించాడు. ఈ పీరియడ్ ఫిలింలో ఒక జమీందార్ కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రేమించి కష్టాలు ఎదుర్కొనే సాధారణ కుర్రాడిగా నటిస్తున్నాడు ఆనంద్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English