ఇది గానీ ఆడిందంటే రజనీకాంత్ ఔట్

ఇది గానీ ఆడిందంటే రజనీకాంత్ ఔట్

తమిళ స్టార్ హీరో విజయ్ ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోతున్నాడు కొన్నేళ్లుగా. ఒక ఐదేళ్లు వెనక్కి వెళ్తే సూపర్ స్టార్ రజనీకాంత్ మార్కెట్లో అతడి మార్కెట్ సగం ఉండేది. కానీ ఇప్పుడు రజనీకాంత్‌తో సమానంగా మార్కెట్, క్రేజ్ సంపాదించుకున్నాడు. అతడి గత సినిమా ‘సర్కార్’ డివైడ్ టాక్‌తో కూడా రూ.150 కోట్ల దాకా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. దానికి ముందు ‘మెర్శల్’ రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లు దాటింది. ఓవైపు రజనీకాంత్ సినిమా సినిమాకు కిందికి పడిపోతున్నాడు. ఆయన మార్కెట్ దెబ్బ తింటోంది. మునుపటి స్థాయిలో రజనీ సినిమాలకు బిజినెస్ కావట్లేదు. పాన్ ఇండియా స్టార్‌గా ఉన్న రజనీ.. ఇప్పుడు తన పరిధిని తగ్గించేసుకుంటున్నాడు. ‘2.0’ను పక్కన పెట్టి చూస్తే తెలుగులో ఒకప్పుడు రూ.32 కోట్లకు చేరిన ఆయన మార్కెట్ అందులో సగానికి పడిపోయింది. ‘పేట’ సినిమాను రూ.15 కోట్లకు కొంటే అందులో సగమే వసూలు చేసింది.

సూపర్ స్టార్ కొత్త ిసినిమా ‘దర్బార్’ మీద కూడా అంచనాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇటు విజయ్ కొత్త సినిమాకు ఉన్న క్రేజ్ చూస్తే మామూలుగా లేదు. తనకు ‘తెరి’, ‘మెర్శల్’ లాంటి బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన అట్లీ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న సినిమా ‘బిగిల్’. ఈ రోజు విజయ్ పుట్టిన రోజు సందర్భంగా నిన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. రెంటికీ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. విజయ్ ద్విపాత్రాభినయం చేస్తుండటం.. అందులో ఒకటి స్పోర్ట్స్‌మ్యాన్‌గా, ఇంకోటి కత్తి పట్టిన రౌడీగా కనిపిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. యావరేజ్ కంటెంట్ ఉన్న సినిమాలతోనే అట్లీ ఇంతకుముందు విజయ్‌కి రెండు బ్లాక్ బస్టర్లు అందించాడు. వాటితో పోలిస్తే ‘బిగిల్’ కథాకథనాలు భిన్నంగా ఉండేలాగే కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని దీపావళికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే కొత్త రికార్డులు నమోదవడం.. రజనీకాంత్ అందుకోలేని స్థాయికి విజయ్ చేరిపోవడం గ్యారెంటీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English