అప్పుడు కాజల్.. ఇప్పుడు తమన్నా.. ఛోటా మళ్లీ దొరికాడు

అప్పుడు కాజల్.. ఇప్పుడు తమన్నా.. ఛోటా మళ్లీ దొరికాడు

గత ఏడాది ‘కవచం’ సినిమాకు సంబంధించిన ఒక వేడుకలో పబ్లిగ్గా కాజల్ అగర్వాల్‌కు ముద్దు పెట్టేసిన సినిమాటోగ్రాఫర్ ఛోటా కే నాయుడు ఏ స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడో తెలిసిందే. ఛోటాకు అమ్మాయిల మోజు ఎక్కువనే విషయం ముందు నుంచే ఇండస్ట్రీలో ప్రచారంలో ఉంది. స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తనకున్న ఆ ఇమేజ్ గురించి ఛోటానే చెప్పుకున్నాడు. ఛోటా తీరుగా హర్టయిన కాజల్ ఫ్యాన్స్.. ఛోటాలోని నెగెటివ్ కోణాన్ని ఎలివేట్ చేసే వీడియోలన్నీ పట్టుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టేసి అతడి పరువు తీసే ప్రయత్నం చేశారు. అప్పట్నుంచి ఛోటా కొంచెం జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నట్లు కనిపించాడు. కానీ తాజాగా ఛోటా తనలోని ‘రొమాంటిక్’ కోణాన్ని చూపించేశాడు. ‘రాజు గారి గది-3’ ప్రారంబోత్సవం సందర్భంగా ఆయన కథానాయిక తమన్నాతో ప్రవర్తించిన తీరు వివాదాస్పదమవుతోంది.

ప్రారంభోత్సవం తర్వాత ఫొటోలకు పోజులిచ్చే సమయంలో దూరంగా ఉన్నవాడు తమన్నా పక్కకు చేరాడు ఛోటా. ఆపై తమన్నా చేతిని గట్టిగా పట్టుకున్న ఛోటా.. ఎంతకీ విడిచిపెట్టలేదు. తమన్నా కొంచెం చేతిని విడిపించుకోవాలని చూసినా.. ఆయన గట్టిగా అలాగే పట్టుకోవడం వీడియోలో కనిపించింది. అప్పుడు కాజల్ లాగే తమన్నా సైతం తన అసహనాన్ని బయటికి చూపించకుండా హుందాగా ప్రవర్తించింది. కానీ ఛోటా మాత్రం మరోసారి సోషల్ మీడియాకు టార్గెట్ అయ్యాడు. ఒకసారి అంత పెద్ద వివాదం అయ్యాక కూడా ఛోటా జాగ్రత్త పడకుండా మరోసారి తన వక్ర బుద్ధిని చూపించాడంటూ నెటిజన్లు అతడి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మరి ఛోటా మళ్లీ మళ్లీ పబ్లిక్‌లో ఇలా ఎలా ప్రవర్తిస్తున్నాడన్నది అర్థం కాని విషయం. ఈ ప్రవర్తన మున్ముందు ఆయన కెరీర్ మీదే ప్రభావం చూపించినా ఆశ్చర్యం లేదు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English