మాస్ పిచ్చిని వదిలేసినట్లేనా బాబూ?

మాస్ పిచ్చిని వదిలేసినట్లేనా బాబూ?

లవ్వర్ బాయ్ గా చేయాలా లేదంటే మాస్ సినిమాలను తియ్యాలా అనే కన్ఫ్యూజన్ తో చాన్నాళ్ళు అక్కినేని నాగచైతన్య వర్రీ అయిపోయాడు. పైగా తీసిన మాస్ సినిమాలన్నీ ఫ్లాపులే కావడంతో అసలు మనోడికి బిపి పెరిగిపోయి ఉంటుంది. కాని ప్రేమమ్, మజిలి వంటి సినిమాలు హిట్టవ్వడం చూస్తుంటే, వరుసగా ఓ రెండు మూడు రొమాంటిక్ సినిమాలు చేసి, మధ్యలో ఒక మాస్ సినిమా చేయాలని మనోడు ఫిక్సయ్యాడట.

యుద్దం శరణం, సవ్యసాచి, శైలజారెడ్డి అల్లుడు అంటూ మాస్ సినిమాలను చేసిన నాగచైతన్య కాస్త గట్టిగానే ఎదురు దెబ్బలు తిన్నాడు. కాని రొమాంటిక్ డ్రామా మజిలి మనోడ్ని బాగా సేవ్ చేసింది. ఆ తరువాత వెంటనే అంకుల్ వెంకీతో కలసి యాక్షన్ కామెడీ చేస్తున్నాడు. అయితే తరువాత మళ్ళీ వరుసగా మాస్ సినిమాలను చేసి చేతులు కాల్చుకోకుండా, వెంటనే శేఖర్ కమ్ముల సినిమా ఒప్పేసుకున్నాడు. ఖచ్చితంగా అదొక మినిమం గ్యారెంటీ సినిమా అవుతుందని మనం చెప్పుకోవచ్చు.

ఇక మొత్తంగా నాగ చైతన్య మాస్ పిచ్చిన పూర్తిగా వదిలేసినట్లేనా అనేదే ఇప్పుడు ప్రశ్న. నిజంగానే వరుసగా ఇటువంటి రొమాంటిక్ డ్రామాలు చేసుకుంటూపోతే చైతన్యకు అస్సలు తిరుగే ఉండదు. అతడి ఫాలోయింగ్ అలాంటిది. ఒకవేళ శేఖర్ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ కొడితే మాత్రం, ఖచ్చితంగా మనోడు మాస్ ను పక్కనెట్టి పనిచేసుకోవాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English