మళ్ళీ కేరాఫ్‌ సేమ్ ఫార్ములా..

 మళ్ళీ కేరాఫ్‌ సేమ్ ఫార్ములా..

ఒక సినిమా భారీగా హిట్టయిపోయి దానికి విపరీతమైన డబ్బులు వచ్చేస్తే మాత్రం.. వెంటనే రెండో సినిమా మూడో సినిమాకు పెద్ద పెద్ద స్టార్లు సైతం దొరికేస్తారు. అదే ఒక దర్శకుడు క్రిటిక్స్ తో ఆహా అనిపించుకున్నా కూడా బాక్సాఫీస్ దగ్గర కాసులు రాబట్టలేకపోతే మాత్రం, అతనికి కొంచెం ప్రాబ్లమాటిక్ గానే ఉంటుంది. వెల్కమ్ టు టాలీవుడ్.

కేరాఫ్‌ కంచరపాలెం సినిమాతో వెంకటేష్ మహా అనే దర్శకుడు బాగా పాపులర్ అయ్యాడు. పైగా ఆ సినిమాలో ఎండింగ్ లో ఇచ్చిన ట్విస్టుకు, అలాగే రియలిస్టిక్ గా తీసిన కొన్ని సీన్లకు, చాలామంది కనక్ట్ అయిపోయారు. ఆ సినిమా చూశాక టాలీవుడ్లో చాలామంది మైండ్స్ పోతాయ్ అంటూ అప్పట్లో పెద్ద పెద్ద సెలబ్రిటీలు కామెంట్స్ చేశారు. కాని కట్ చేస్తే, సినిమాకు వసూళ్ళుపరంగా పెద్దగా వర్కవుట్ కాలేదు. దానితో దర్శకుడుకి పెద్దగా అవకాశాలేం రాలేదు. కాకపోతే కంచరపాలెం తీసిన నిర్మాతతోనే చేతులు కలిపి, ఇప్పుడు మళ్లీ కొత్త నటీనటులను తీసుకుని, ఒక కొత్త సినిమా తీస్తున్నాడు ఈ డైరక్టర్.

అదే కనుక మనోడు తీసిన కంచరపాలెం కూడా పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి తరహాలో ఆడేసుంటే.. ఈ దర్శకుడు కూడా ఎన్టీఆర్ అండ్ మహేష్‌ బాబులతో పార్టీ చేసుకునుండేవాడు. సర్లేండి, అందరూ కమర్షియల్ సినిమాలే తీస్తే మరి ఆర్ట్ సినిమాలు తీసేదెవరు? ఒక ప్రక్కన అవార్డ్స్ రాలేదంటారు, ఇంకో ప్రక్కన ఎంకరేజ్ చేయరు!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English