వాళ్ళది రొమాన్సు? నాది ద్వేషమా

 వాళ్ళది రొమాన్సు? నాది ద్వేషమా

బైక్ మీద వెళుతూ ముద్దు పెట్టుకున్నారు. బైక్ పడిపోయింది. యాక్సిడెంట్ అయ్యింది. అయినా సరే ముద్దే పెట్టేసుకుంటూనే ఉన్నారంటే.. అదే ప్రేమా? లేకపోతే కళ్ళను కమ్మేసిన కామమా? సరిగ్గా ఇటువంటి ప్రశ్నలే ఇప్పుడు హీరో షాహిద్ కపూర్ ను చాలామంది అడుగుతున్నారు. బాలీవుడ్ అంతా మనోడ్ని మిసోజనెస్ట్ (స్త్రీల పట్ల ద్వేషం కలిగినవాడు) అంటూ ఏకిపాడేస్తున్నారు. అయితే తన 'కబీర్ ఖాన్' సినిమాను ఈ తరహాలో టార్గెట్ చేయడం తగదంటున్నాడు ఈ టాలెంటెడ్ హీరో.

నిజానికి అర్జున్ రెడ్డి సినిమా రిలీజైనప్పుడు తెలుగులో కూడా ఈ తరహా కామెంట్లే వినిపించాయి. ఇక బాలీవుడ్లో అయితే, మనోడు బలవంతపు శృంగారాన్ని, అలాగే డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ ను భారీగా ప్రమోట్ చేస్తున్నాడంటూ కొందరు ధ్వజమెత్తారు. అసలు హీరోయిన్ ను లెంపకాయ్ కొడతావా అంటూ ట్విట్టర్లో వీరంగం చేస్తున్నారు. దీని గురించి స్పందించిన షాహీద్.. ''మొన్న రిలీజైన గల్లీ బాయ్ సినిమాలో ఆలియా భట్ తన బాయ్ ఫ్రెండ్ కు వేరొక అమ్మాయి లవ్ మెసేజ్ పంపిందని, ఆ అమ్మాయిని చెత్త కొట్టుడు కొడుతుంది. ఆ సీన్ మీకు నచ్చింది కాని, నా సీన్లో మాత్రం తప్పులు దొరికాయా?'' అంటూ రివర్సులో మీడియాకే క్వశ్చన్లు వేశాడు.

గతంలో గ్యాంగ్స్ ఆఫ్‌ వసేపూర్, బద్లాపూర్ వంటి సినిమాల్లో సెక్స్ మరియు రేప్ లను కూడా ఘోరంగా చూపించినా.. వాటిని ఆర్టిస్టిక్ ఫిలింస్ అంటూ పొగిడేసిన బాలీవుడ్ క్రిటిక్స్, ఇప్పుడు షాహిద్ ను టార్గెట్ చేయడం మాత్రం కాస్త వింతగానే ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English