కమ్ముల ఆ సినిమాను వదిలేశాడా?

కమ్ముల ఆ సినిమాను వదిలేశాడా?

‘ఫిదా’ సినిమాతో శేఖర్ కమ్ముల అదిరిపోయే రేంజిలో కమ్ బ్యాక్ అయ్యాడు. దీని తర్వాత కమ్ములతో పని చేయడానికి పెద్ద హీరోలే రెడీగా ఉన్నప్పటికీ అతను మాత్రం ‘హ్యాపీడేస్’, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ తరహాలో అందరూ కొత్తవాళ్లతో ఒక యూత్ ఫుల్ మూవీ మొదలుపెట్టాడు. ఈ సినిమా స్క్రిప్టు మీద చాలా కాలం పనిచేసి.. వర్క్ షాప్ ద్వారా నటీనటుల్ని ఎంపిక చేసి.. కొన్ని నెలల కిందటే సినిమా మొదలుపెట్టాడు శేఖర్. షూటింగ్ చకచకా పూర్తవుతున్నట్లు కూడా వార్తలొచ్చాయి. ఐతే ఇప్పుడు ఉన్నట్లుండి నాగచైతన్యతో శేఖర్ సినిమా అంటూ అప్ డేట్ వచ్చింది.ప్రస్తుతం చేస్తున్న సినిమాను పూర్తిచేసి ఆ తర్వాత చైతూ చిత్రాన్ని శేఖర్ మొదలుపెడతాడని అనుకున్నారు. కానీ కొత్తవాళ్లతో చేస్తున్న సినిమాను ఆపేసి చైతూ చిత్రాన్ని కమ్ముల మొదలుపెట్టబోతున్నట్లు వార్తలొస్తుండటం గమనార్హం.

ఏషియన్ సినిమా అధినేత సునీల్ నారంగ్ నిర్మాణంలో కమ్ముల చేస్తున్న సినిమా ఔట్ పుట్ అనుకున్నట్లుగా రాలేదట. మధ్యలో రషెస్ చూసుకుని దర్శక నిర్మాతలిద్దరూ అసంతృప్తికి లోనయ్యారట. ఈ సినిమా వర్కవుట్ కాదన్న ఉద్దేశంతో దాన్ని మధ్యలో వదిలేద్దామని నిర్ణయించుకున్నారట. ఈ సినిమాపై ఇప్పటికే నాలుగైదు కోట్ల దాకా ఖర్చు పెట్టినప్పటికీ.. అయినా పర్వాలేదని సినిమాను ఆపేసినట్లు చెప్పుకుంటున్నారు. కమ్ముల-చైతూ-సాయిపల్లవి కాంబినేషన్లో సినిమాకు మంచి క్రేజ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వృథా అయిన బడ్జెట్‌ను ఆ సినిమాతో రికవర్ చేసుకోవచ్చని భావిస్తున్నారట. మరి ఈ సినిమా మీద ఆశలు పెట్టుకున్న కొత్త నటీనటుల పరిస్థితి ఏంటి అన్నది ప్రశ్నార్థకం. కమ్ముల-చైతూ సినిమా సెప్టెంబరులో సెట్స్ మీదికి వెళ్లనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English