‘కల్కి’ రిలీజ్ ముంగిట కాంట్రవర్శీ

‘కల్కి’ రిలీజ్ ముంగిట కాంట్రవర్శీ

‘పీఎస్వీ గరుడవేగ’ తర్వాత సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన సినిమా ‘కల్కి’. విభిన్నమైన ప్రోమోలతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి రేెకెత్తించగలిగింది ‘అ!’ దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ప్రి రిలీజ్ బజ్ బాగానే ఉందని అనుకుంటుంటే.. ఈ చిత్రాన్ని అనుకోని వివాదం చుట్టుముట్టింది. ‘కల్కి’ కథ తనదని.. దాన్ని కాపీ కొట్టి రాజశేఖర్ అండ్ కో సినిమా తీశారని అంటూ కార్తికేయ అనే రచయిత ఆరోపిస్తున్నాడు. తాను రాజశేఖర్ నటించిన ‘మహంకాళి’ సినిమాకు రచయితనని, ఆ సినిమాకు పని చేస్తున్న సమయంలోనే తాను ఆయనకు ‘కల్కి’ కథ చెప్పానని.. కొన్ని కారణాల వల్ల అది పట్టాలెక్కలేదని.. ఇప్పుడు చూస్తే సైలెంటుగా తన కథనే ‘కల్కి’గా తీశారని తెలిసిందని ఆరోపిస్తున్నాడు కార్తికేయ.


ఈ విషయమై తన అభ్యంతరాలు వ్యక్తం చేసినా ‘కల్కి’ టీం పట్టించుకోలేదని.. కథ గురించి అడిగితే తాము ఒక వెబ్ సైట్ నుంచి కొన్నట్లు చెప్పారని.. ఆ వెబ్ సైట్‌లో ఏమీ లేదని అతను అంటున్నాడు. దీనిపై రాజశేఖర్, ‘కల్కి’ దర్శక నిర్మాతలు ఏమంటారో చూడాలి. దీనిపై తాను కోర్టుకు కూడా వెళ్లనున్నట్లు కార్తికేయ చెప్పాడు. నిజంగా ఈ కథ తనదే అయితే కార్తికేయ ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఉన్నాడన్నది అర్థం కావడం లేదు. రిలీజ్ ముంగిట మాట్లాడితే.. అందరి అటెన్షన్ ఉంటుందని.. కోర్టు కూడా సత్వరం స్పందించి విడుదలను ఆపుతుందని అతను అనుకున్నాడని అనుకోవాలా? తనకు డబ్బులు కూడా అవసరం లేదని.. కథకుడిగా క్రెడిట్ ఇస్తే చాలని అతనంటుండటం విశేషం. సాధారణంగా తమిళంలో పెద్ద సినిమాల విడుదలకు ముందు ఇలాంటి కాపీ గొడవలు తలెత్తుతుంటాయి. ఈ మధ్య తెలుగులోనూ ఈ ఒరవడి కనిపిస్తోంది. ఇంతకీ ‘కల్కి’ కాపీ ఆరోపణలపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుంద చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English