నాగార్జున ఇన్‌వాల్వ్‌మెంట్‌ లేకుండానే...!

నాగార్జున ఇన్‌వాల్వ్‌మెంట్‌ లేకుండానే...!

నాగ చైతన్య సెట్‌ చేసుకుంటోన్న ప్రాజెక్టులు చూస్తే అతని సమవుజ్జీలు ఎవరికయినా కన్ను కుడుతుంది. ఆమధ్య యాక్షన్‌, మాస్‌ అంటూ ట్రాక్‌ తప్పిన చైతన్య ఇప్పుడు తన బలమేంటో స్పష్టంగా తెలుసుకున్నాడు. మజిలీ చిత్రంతో మంచి విజయాన్ని దక్కించుకున్న చైతన్య ఆ ఉత్సాహంలో మరిన్ని ఆసక్తికరమైన చిత్రాలని క్యూలో పెడుతున్నాడు. వెంకటేష్‌తో కలిసి నటిస్తున్న 'వెంకీ మామ' ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. ఈ చిత్రానికి వున్న క్రేజ్‌ ఎలాంటిదో చెప్పాల్సిన పని లేదు.

తాజాగా శేఖర్‌ కమ్ములతో సినిమా ఓకే చేసేసాడు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించే ఈ చిత్రం సెప్టెంబర్‌లో మొదలు కానుంది. ఇదివరకు చైతన్య సినిమాలకి నాగార్జున గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాల్సి వచ్చేది. కానీ ఇప్పుడతనికే నాగ్‌ పూర్తి స్వేఛ్ఛనిచ్చేసాడు. చైతన్య అంగీకరించే కథల విషయంలో నాగ్‌ జోక్యం చేసుకోవడం లేదు. ఎడిటింగ్‌ దగ్గర మాత్రం నాగ్‌ సలహాలు తీసుకుంటున్నాడు. మజిలీకి ముందు చై కెరియర్‌ రాంగ్‌ ట్రాక్‌లో వెళుతోందని నాగ్‌ కాస్త వర్రీ అయినా కానీ మజిలీ తర్వాత ఇక నాగార్జున ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదు. ఆ మాటకొస్తే అఖిల్‌ నాలుగవ చిత్రానికి కూడా నాగ్‌ ఇంటర్‌ఫియరెన్స్‌ లేదు. అల్లు అరవింద్‌ చేతుల్లో అఖిల్‌ని పెట్టేసి నాగ్‌ తన పనులతో తాను బిజీ అయిపోయాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English