వైరల్ పిక్.. బాలయ్య అభిమానిగా జగన్

 వైరల్ పిక్.. బాలయ్య అభిమానిగా జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యుక్త వయసులో నందమూరి బాలకృష్ణకు పెద్ద ఫ్యాన్ అనే మాట ఎప్పట్నుంచో వింటున్నాం. కానీ జగన్ ఆ విషయాన్ని ఎప్పుడూ చెప్పుకున్నది లేదు. రాయలసీమలో, ముఖ్యంగా కడప జిల్లాలో బాలయ్యకు భారీగా అభిమానగణం ఉంది. కాబట్టి యుక్త వయసులో జగన్ బాలయ్య అభిమాని అయి ఉంటే అందులో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు.

ఐతే జగన్ ఎప్పుడూ బహిరంగంగా చెప్పని ఈ విషయం.. ఇప్పుడు ఒక ఫొటోతో అధికారికం అయింది. బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిన ‘సమరసింహారెడ్డి’.. అప్పట్లో కొన్ని సెంటర్లలో ఏకంగా ఏడాది పాటు ఆడేసింది. 1999లో ఈ చిత్రం ప్రభంజనం సృష్టించాక.. ‘సమరసింహారెడ్డి’ 365 డేస్ పోస్టర్‌తో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ జగన్ పేరిట ఒక యాడ్ రావడం విశేషం.

ఇందులో జగన్ పేరు ముందు ‘కడప జిల్లా బాలయ్య అభిమానుల సంఘం ప్రెసిిడెంట్’ అని ఉండటం అన్నిటికంటే పెద్ద విశేషం. బాలకృష్ణను ఇందులో ‘మా బాలయ్య బాబు’ అని కూడా సంబోధించారు. దాని పైన బాలయ్యను పొగిడేస్తూ ఒక మెసేజ్ కూడా ఉంది. ఈ యాడ్‌కు సంబంధించిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పుడు లక్షలమంది బాలయ్య అభిమానుల్లో ఒకడిగా ఉన్న జగన్.. ఇప్పుడు బాలయ్య ఎమ్మెల్యేగా ఉన్న అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేల బలంతో సీఎం కుర్చీలో కూర్చుని ఉండటం ఆశ్చర్యకరమే.

బాలయ్య మీద ఒకప్పుడున్న అభిమానమే కారణమో ఏమో కానీ.. ఆయన్ని జగన్ మరీ తీవ్రంగా విమర్శించిన దాఖలాలు పెద్దగా కనిపించవు. చంద్రబాబును టార్గెట్ చేసినట్లుగా బాలయ్యను జగన్ లక్ష్యంగా చేసుకోడు. బాలయ్య ఫస్ట్ టెర్మ్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జగన్ అసెంబ్లీకి వచ్చింది తక్కువే. మరి ఈ టెర్మ్‌లో అసెంబ్లీలో బాలయ్యతో ముఖ్యమంత్రి జగన్ ఎలా వ్యవహరిస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English