చైతన్య జోరు.. అఖిల్‌ బేజారు

చైతన్య జోరు.. అఖిల్‌ బేజారు

నాగచైతన్య హీరోగా పరిచయమైన దశాబ్ధానికి కూడా అగ్ర హీరోల సరసన చోటు సంపాదించలేకపోయాడు. ఇప్పటికీ నాని, శర్వానంద్‌, విజయ్‌ దేవరకొండ, నితిన్‌ తదితర హీరోలతోనే నాగచైతన్య పోటీ పడుతున్నాడు. చైతన్య పెద్ద స్టార్‌ అవుతాడని ఆశించిన అభిమానులు అతను అగ్ర హీరోల జాబితాకి చేరుకోలేదని నాగార్జున చిన్న కొడుకు అఖిల్‌పైకి ఫోకస్‌ షిఫ్ట్‌ చేసారు. కానీ అఖిల్‌ కనీసం నాగచైతన్య రేంజ్‌కి కూడా చేరుకోలేకపోయాడు. మూడు సినిమాల్లో నటించినా ఇంతవరకు విజయం దక్కించుకోలేకపోయిన అఖిల్‌ నాలుగవ చిత్రానికి ఫ్లాప్‌ డైరెక్టర్‌ భాస్కర్‌తో చేస్తున్నాడు. ఇది గీతా ఆర్ట్స్‌ నిర్మిస్తోన్న సినిమా కనుక విషయం వుందనే అనుకుంటున్నారు.

అయితే ఎంత విషయం వుంది, ఎంత రేంజ్‌కి వెళుతుంది అనేది చూస్తే కానీ చెప్పలేం. పెద్ద రేంజ్‌కి వెళ్లే చిత్రమని భావిస్తే ఫామ్‌లో వున్న హీరోనే తీసుకుని వుండేవారు కదా అంటూ అభిమానులకో డౌట్‌. తక్కువ బడ్జెట్‌లో తీయాలని భావిస్తున్నారు కనుకే ఈ కథ అఖిల్‌కి వెళ్లిందని, లేదంటే విజయ్‌ దేవరకొండ లాంటి హీరోనే పెట్టుకునే వారని కామెంట్స్‌ పడుతున్నాయి. ఇంతవరకు అఖిల్‌ సినిమాలపై అంతో ఇంతో అంచనాలుండేవి. ఈ చిత్రానికి అస్సలు అంచనాలు లేకపోవడం కూడా ప్లస్‌ అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా రావడంతో పాటు తక్కువ బడ్జెట్‌ కూడా ఈ చిత్రానికి కమర్షియల్‌ సక్సెస్‌ని ఈజీ చేస్తుందనేది వారి అనాలసిస్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English