షాకింగ్‌ టీజర్‌: నగ్నంగా అమల!

షాకింగ్‌ టీజర్‌: నగ్నంగా అమల!

క్యారెక్టర్‌ కోసం, కథ కోసం దక్షిణాది తారలు, అందునా అమలాపాల్‌ లాంటి పాపులర్‌ తారలు కెమెరా ముందు నగ్నంగా కనిపించడానికి అస్సలు అంగీకరించరు. దక్షిణాది వరకు ఎందుకు... కొందరు సి గ్రేడ్‌ తారలు మినహా బాలీవుడ్‌లో కూడా న్యూడిటీకి ఊ కొట్టే వారుండరు. అలాంటి తమిళ చిత్రం 'ఆడై' కోసం అమలా పాల్‌ నగ్నంగా నటించింది. ఏదో కెమెరా ట్రిక్కులా కాకుండా నిజంగానే కెమెరా ముందు వివస్త్రగా కనిపించింది. ఈ చిత్రం టీజర్‌ని రాంగోపాల్‌వర్మ విడుదల చేయడం విశేషం. రత్నకుమార్‌ అనే దర్శకుడు రూపొందిస్తోన్న ఈ విప్లవాత్మక చిత్రం తెలుగులోకి ఆమె పేరుతో అనువాదం అవుతోంది.

ఒక బహుళ అంతస్తుల భవంతిలో అమలా పాల్‌ వివస్త్రగా నెత్తురోడుతూ పడి వుంటే పోలీసులు, జనం గుమికూడి చూస్తుంటారు. సడన్‌గా స్పృహలోకి వచ్చిన అమలా పాల్‌ నగ్న శరీరాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తుంది. ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసిన ఈ టీజర్‌ ఇటీవలి కాలంలో బోల్డ్‌ అవుతోన్న దక్షిణాది సినిమాకి అద్దం పడుతుంది. ఇలాంటి సన్నివేశాలు హాలీవుడ్‌లో మినహా ఇక్కడ ఎక్స్‌పెక్ట్‌ చేయలేం. మరి టీజరే ఇలావుంటే ట్రెయిలర్‌ ఇంకెంత సంచలనం అవుతుందో చూడాలి. మొత్తానికి చిన్న టీజర్‌తోనే 'ఆమె' అందరి దృష్టిలో పడిపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English