సాయి ధరమ్‌ తేజ్‌ దశావతారం!

సాయి ధరమ్‌ తేజ్‌ దశావతారం!

ప్రతి సినిమాలోను సింగిల్‌ ఎమోషన్‌, సింగిల్‌ టార్గెట్‌ అన్నట్టుగా మాస్‌ని మెప్పించేందుకు విఫలయత్నం చేసిన సాయి ధరమ్‌ తేజ్‌ వరుస పరాజయాలతో బాగా కుదురైపోయాడు. ఇదివరకటిలా అతనిప్పుడు దర్శకుడి ఘన కీర్తిని చూసి సినిమాలు సైన్‌ చేయడం లేదు. అలాగే ప్రతి సినిమాలోను ఒకే పద్ధతి పాటించాలని కూడా చూడడం లేదు. చిత్రలహరితో ఒక మాదిరి విజయం వరించినా కానీ మళ్లీ లవర్‌బాయ్‌గా కనిపించడానికి అతను ఇష్టపడడం లేదు. అదే తరహాలో మళ్లీ కనిపిస్తే తిరస్కరిస్తారని ఈసారి మారుతి సినిమాలో ఫ్యామిలీ డ్రామాని నమ్ముకుంటున్నాడు.

ప్రతిరోజు పండగే అనే టైటిల్‌తోనే ఇది ఫక్తు కుటుంబ కథా చిత్రమనేది చెబుతున్నాడు. మారుతి సినిమా తర్వాత దేవా కట్టాతో ఒక సినిమా చేయడానికి తేజ్‌ అంగీకరించాడు. ప్రస్థానం తర్వాత మళ్లీ మెప్పించలేకపోయిన దేవా కట్టా అసలు ఏమైపోయాడనేది కూడా ఎవరికీ గుర్తు లేదు. దాదాపుగా కనుమరుగైన దర్శకుడి వద్ద వున్న కథ తనకి పనికొస్తుందని నమ్మి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసాడు. చేసే సినిమాల్లో ఒక దానికి ఒకటి సంబంధం వుండకుండా వివిధ జానర్లు టచ్‌ చేస్తూ హీరోగా ఆల్‌రౌండర్‌ అనిపించుకోవాలనే లక్ష్యంతో తేజ్‌ దూసుకుపోతున్నాడు. ఆరు పరాజయాల పరంపర ఈ మెగా హీరోకి ఎన్ని జీవిత పాఠాలని నేర్పేసిందో కదూ!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English