ప్రభాసే బిగ్‌ బాస్‌!

ప్రభాసే బిగ్‌ బాస్‌!

తెలుగు మార్కెట్‌ని దాటి పక్క రాష్ట్రాల్లోకి విస్తరించాలని మన హీరోలందరికీ వుంటుంది కానీ ఈ విషయంలో ప్రభాస్‌ బిగ్‌ బాస్‌ అనిపించుకున్నాడు. ఎందుకంటే అతనికిపుడు తెలుగులో కంటే హిందీలో ఎక్కువ రీచ్‌ పెరిగింది. సాహో టీజర్‌కి వచ్చిన వ్యూస్‌తోనే ఇది సుస్పష్టమవుతోంది. తెలుగులో ఇరవై అయిదు మిలియన్ల వ్యూస్‌ తెచ్చుకున్న సాహూకి హిందీలో ముప్పయ్‌ అయిదు మిలియన్ల వ్యూస్‌ దాటిపోయాయి. తమిళంలో కూడా పదిహేను మిలియన్ల వ్యూస్‌ రావడంతో దేశం నలుమూలలా వ్యాపించిన తొలి తెలుగు హీరోగా ప్రభాస్‌కి ఖ్యాతి దక్కింది. బాహుబలికి క్రేజ్‌ వచ్చిందంటే దానికి అనేక కారణాలుంటాయి కానీ సాహోకి ప్రభాస్‌ సోలో అనే చెప్పాలి.

బాహుబలి తర్వాతి సినిమా అనే క్రేజ్‌ ఒక్కటి మినహాయిస్తే మిగతాదంతా ప్రభాస్‌ గొప్పతనమే అవుతుంది. మిగిలిన తెలుగు హీరోలు కూడా ఇతర మార్కెట్ల మీద దృష్టి పెడుతున్నారు కానీ రాజమౌళి వల్ల ప్రభాస్‌ ముందుగా అక్కడ జెండా పాతేసాడు. సాహో కూడా ఇతర రాష్ట్రాలలో సక్సెస్‌ అయిందంటే మాత్రం ఇండియన్‌ సినిమాకి నంబర్‌వన్‌గా అవతరిస్తాడు. బాహుబలి చిత్రానికి వచ్చిన రీచ్‌ని క్యాష్‌ చేసుకునేలా సాహోని ఈ స్థాయిలో ప్లాన్‌ చేయడం నిజంగా సూపర్‌ మూవ్‌. సక్సెస్‌ చాలా మందికి వస్తుంది కానీ దానిని మాగ్జిమైజ్‌ చేసుకుని స్థిరమైన మార్కెట్‌గా మార్చుకోవడం రియల్లీ గ్రేట్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English