తారక్‌, చరణ్‌ ఇద్దరికీ ఒకడే కావాలి!

తారక్‌, చరణ్‌ ఇద్దరికీ ఒకడే కావాలి!

రాజమౌళితో చేసే సినిమా ఎలాగో రికార్డులు తిరగరాస్తుంది కానీ దాని తర్వాత చేసే సినిమా ఎలా వుండాలనే దానిపై అప్పుడే 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' హీరోలు చరణ్‌, తారక్‌కి జంఝాటం మొదలయింది. రాజమౌళి సినిమా తర్వాత వచ్చే చిత్రాన్ని ఎవరయితే బాగా హ్యాండిల్‌ చేయగలరంటూ ఇద్దరూ పడుతోన్న మధనం ఒక్కడి దగ్గరే ఆగింది. అతనెవరో కాదు... రాజమౌళి తర్వాత అలా హండ్రెడ్‌ పర్సంట్‌ హిట్‌ రేట్‌ వున్న శివ కొరటాల. విశేషం ఏమిటంటే ఈ ఇద్దరు హీరోలతోను శివకి కమిట్‌మెంట్స్‌ వున్నాయి.

చరణ్‌తో శివ సినిమా చాలా కాలంగా పెండింగ్‌లో వుంటే, తారక్‌తో సినిమా వాయిదా పడడం వలనే కొరటాల శివ వేరే ప్రాజెక్టులతో బిజీ అయ్యాడు. ఆర్‌.ఆర్‌.ఆర్‌. తర్వాత నాతో చేయాలంటే నాతో చేయాలంటూ ఇప్పటికే ఇద్దరు హీరోలు అర్జీలు పెట్టుకున్నారట. అయితే తాను రాసే కథ ఇద్దరిలో ఎవరికి బాగా సూట్‌ అవుతుందనిపిస్తే వారితో చేస్తానని, ఇద్దరికీ సూట్‌ కాదనిపిస్తే వేరే హీరోతో చేస్తానని శివ చెప్పాడట. దీంతో ఆర్‌.ఆర్‌.ఆర్‌. తర్వాతి సినిమాని ఈ ఇద్దరు హీరోలలో ఎవరితో శివ తీస్తాడనేది సర్వత్రా ఆసక్తికరమయింది. రాజమౌళి సినిమా తర్వాత మరో బ్లాక్‌బస్టర్‌ వెంటనే ఇవ్వగలిగిన హీరోకి తిరుగే వుండదు కాబట్టి ఇంత టెన్షన్‌ నెలకొంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English