బన్నీ సినిమా నుంచి తీసేశారు.. క్లారిటీ ఇచ్చిన పృథ్వీ

బన్నీ సినిమా నుంచి తీసేశారు.. క్లారిటీ ఇచ్చిన పృథ్వీ

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఎన్నికలప్పుడు వాళ్లే తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం కూడా చేశారు. అలాంటి వారిలో ప్రముఖ కమెడియన్ పృథ్వీ రాజ్ ఒకరు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ తెలుగు సినిమా పరిశ్రమలో పాతుకుపోయిన హాస్యనటుడు పృథ్వీరాజ్.. రాజకీయాల్లోనూ తన మార్క్ చూపించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్రలో వైసీపీలో చేరడం.. ఆయనకు రాష్ట్ర కార్యదర్శి పదవి కట్టబెట్టడం చక చకా జరిగిపోయాయి.

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన అప్పటి అధికార తెలుగుదేశం పార్టీపై, జనసేన, పవన్ కల్యాణ్ సహా మెగా ఫ్యామిలీపై కామెంట్లు కూడా చేశారు. దీంతో ఆ కుటుంబానికి సంబంధించిన ఏ హీరో నటించే సినిమాకైనా పృథ్వీ రాజ్‌ను తీసుకోకూడదని మెగా ఫ్యామిలీ డిసైడ్ అయినట్లు రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా నుంచి సైతం ఆయనను తప్పించారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పృథ్వీ రాజ్ మీడియా ముందుకు వచ్చి, దీనిపై స్వయంగా స్పందించారు.

 ‘‘అత్తారింటికి దారేది సినిమా తర్వాత నేను త్రివిక్రమ్‌ను కలవలేదు. అలాంటప్పుడు బన్నీ సినిమాలో నాకు ఎలా అవకాశం దక్కుతుందని అనుకుంటున్నారు. ఆయన సినిమాలో నాకు అవకాశం ఇచ్చి, తర్వాత తప్పించారని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. దయచేసి ఇలాంటి వార్తలు రాయకండి. ఇలాంటివి ప్రజలకు నెగెటివ్ వైబ్స్‌ను తీసుకెళ్తుంటాయి. రాజకీయాల పరంగా ఎవరితోనైనా విభేదించి ఉండవచ్చు కానీ, సినిమా పరంగా అందరం ఒక్కటే. అందులో మెగా ఫ్యామిలీ కూడా అంతే. వాళ్లంటే నాకు ఎప్పటికీ గౌరవమే’’ అంటూ ఆయన ఈ వార్తలను ఖండించారు.

 గతంలో జనసేన పార్టీకి నాగబాబు 25 ల‌క్షలు, వ‌రుణ్ తేజ్ కోటి రూపాయిలు విరాళాలు ఇచ్చారు. అయితే ఈ డబ్బు ప్యాకేజి ద్వారా వ‌చ్చింద‌ని విమ‌ర్శ‌లు చేశారు న‌టుడు పృథ్వీ. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో యాంకర్.. నాగబాబు వద్ద ప్రస్తావించగా, ఓరేయ్ పృథ్వీ నాకు ఫోన్ చేయ్ నీకు స‌మాధానం చెబుతానంటూ అతనికి వార్నింగ్ ఇచ్చారు. అక్కడితో ఆగకుండా నా ఫోన్ నెంబ‌ర్ నీ దగ్గ‌ర ఉంది కాల్ చేయి, ఈ ప్ర‌శ్న‌కు నేనే నీకు స‌మాధానం చెబుతానంటూ పృథ్వీకి వార్నింగ్ ఇచ్చారు నాగ‌బాబు. అప్పట్లో ఇది సంచలనం అయిన విషయం తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English