సినిమా రిలీజే కాలేదు.. యూట్యూబ్‌లో డెలీటెడ్ సీన్స్

సినిమా రిలీజే కాలేదు.. యూట్యూబ్‌లో డెలీటెడ్ సీన్స్

గత పదేళ్లలో తెలుగు సినిమాల రన్నింగ్ టైం సగటు తీస్తే 2 గంటల 15 నిమిషాలకు అటు ఇటు ఉంటుందేమో. ఒకప్పుడు తెలుగు సినిమా నిడివి మినిమం రెండున్నర గంటలుండేది. మూడు గంటల రన్నింగ్ టైంకు చేరువగా ఉన్న సినిమాలు రెగ్యులర్‌గా వచ్చేవి. కానీ గత దశాబ్దంలో లెంగ్త్ తగ్గించుకుంటూ వచ్చేశారు. ఎడిటింగ్ టేబుల్ దగ్గర నిర్దాక్షిణ్యంగా కోతలు వేసి తక్కువ నిడివితో సినిమాను రిలీజ్ చేయడం మామూలైపోయింది. సినిమా బాగా ఆడుతుంటే.. ముందు కత్తిరించిన సీన్లను కలపడం.. లేదంటే యూట్యూబ్‌లో రిలీజ్ చేయడం చూస్తున్నాం. ఐతే ఇదంతా సినిమా రిలీజ్ తర్వాత జరిగే వ్యవహారం. ఐతే ఇప్పుడు ఓ సినిమా విడుదలకు ముందే డెలీటెడ్ సీన్స్ అంటూ యూట్యూబ్‌లో దర్శనమిస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయం.

ఈ శుక్రవారం రిలీజ్ కానున్న ‘మల్లేశం’ సినిమా విషయంలో జరిగిందీ చిత్రం. పద్మశ్రీ పురస్కారం అందుకున్న చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ప్రియదర్శి హీరోగా రాజ్ అనే నూతన దర్శకుడు రూపొందించిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. కొన్ని రోజులుగా సెల్రెబెటీలకు, మీడియా వాళ్లకు వరుసగా ప్రివ్యూలు వేస్తున్నారు. వాటికి మంచి స్పందన వచ్చింది. ఆల్రెడీ పాజిటివ్ రివ్యూలు కూడా బయటికి వచ్చాయి. ఐతే సినిమా విజయంపై ధీమాగా ఉన్న చిత్ర బృందం.. ఫైనల్ కట్ నుంచి పక్కన పెట్టిన కొన్ని సీన్లను డెలీటెడ్ సీన్స్ అంటూ యూట్యూబ్‌లోకి వదులుతోంది. ఆ సన్నివేశాలు బాగానే ఉన్నాయి కానీ.. సాధారణ ప్రేక్షకులు కూడా సినిమా చూశాక.. సినిమా ఫలితమేంటో తేలాక వీటిని బయట పెట్టి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English