బాలయ్యా.. ఆమెతో ఎన్నిసార్లయ్యా?

బాలయ్యా.. ఆమెతో ఎన్నిసార్లయ్యా?

సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది. ఇది అన్ని ఇండస్ట్రీల్లో ఉన్న సమస్యే. టాలీవుడ్లో ఈ ఇబ్బంది మరీ ఎక్కువగా ఉంది. కాస్త ముందు తరం హీరోయిన్లలో నయనతార ఒక్కతే ఇప్పటికీ మంచి ఫాంలో ఉంది.  తెలుగులో సీనియర్ హీరోలకు అన్ని రకాలుగా పర్ఫెక్టుగా సెట్టయ్యే హీరోయిన్ ఆమె ఒక్కరే. కానీ ఆమెకు ఉన్న విపరీతమైన డిమాండ్ కారణంగా తన దగ్గరికి వచ్చిన అన్ని సినిమాలనూ ఒప్పుకునే పరిస్థితి లేదు. మిగతా సీనియర్ హీరోయిన్లలో అనుష్క ఫాం కోల్పోయిింది. ఆమె లుక్ తేడా కొట్టేసింది. త్రిష ఔట్ డేట్ అయిపోయింది. శ్రియ పరిస్థితి కూడా అంతంతమాత్రమే. దీంతో సీనియర్లకు హీరోయిన్లను సెట్ చేయడం చాలా కష్టమైపోతోంది. ఇప్పుడు ఫాంలో ఉన్న స్టార్ హీరోయిన్లు ఎవరిని పెట్టినా సీనియర్ల పక్కన ఆడ్‌గానే అనిపిస్తున్నారు.

అక్కినేని నాగార్జున పక్కన రకుల్ ప్రీత్‌ను చూడటానికే చాలా ఇబ్బందిగా ఉంది. చిరు పక్కన కాజల్ కూడా అలాగే అనిపించింది. అయినా ఎలాగోలా బండి లాగించేస్తున్నారు. బాలకృష్ణ అయితే రకుల్, కాజల్ లాంటి వాళ్లతో జట్టు కట్టడానికి ఆసక్తి చూపించట్లేదు. తన పక్కన అంత చిన్న హీరోయిన్లు బాగోరని అనుకుంటున్నాడేమో. మళ్లీ మళ్లీ సీనియర్ హీరోయిన్లతోనే వెళ్లిపోతున్నాడు. ఎప్పుడో దశాబ్దంన్నర కిందట జోడీ కట్టిన శ్రియతో ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమా చేశాడాయన. ఆ సినిమాలో కథానాయిక పాత్రకు కూడా శ్రియ లాంటి నటి అవసరమైంది. ఐతే ఆమెతోనే మళ్లీ ‘పైసా వసూల్’ సినిమా చేశాడు. అది ప్రేక్షకులకు రుచించలేదు. శ్రియతో ఇక చాలు అన్నట్లగా అభిప్రాయపడ్డారు బాలయ్య ఫ్యాన్స్. కానీ ఆయన మాత్రం మళ్లీ ఆమెతో జోడీ కట్టడానికి రెడీ అయిపోయాడు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే కొత్త సినిమాకు హీరోయిన్‌గా శ్రియనే ప్రిఫర్ చేశాడట బాలయ్య. వీళ్లిద్దరూ మరోసారి జోడీ కట్టడం ఖాయం అంటున్నారు. కానీ నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో అంత సుముఖంగా లేరని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English