దేవరకొండ దెబ్బకి డైరెక్టర్‌ వాకౌట్‌?

 దేవరకొండ దెబ్బకి డైరెక్టర్‌ వాకౌట్‌?

విజయ్‌ దేవరకొండ అవసరానికి మించి దర్శకుడి పనిలో వేలు పెడతాడనే పేరుంది. ఇదివరకు మార్కెటింగ్‌ వరకు తాను చూసుకునే వాడు. మిగతాదంతా దర్శకుడికి వదిలేసేవాడు. కానీ గీత గోవిందం తర్వాత తన రేంజ్‌ పెరగడంతో దేవరకొండకి జాగ్రత్త పెరిగిపోయి దర్శకుల పనిలోను వేళ్లు బాగా పెడుతున్నాడని చెవులు కొరుక్కుంటున్నారు. 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రానికి దేవరకొండ ఓవర్‌గా ఇన్‌వాల్వ్‌ అవుతున్నాడట. ఏ సీన్‌ వుంచాలి, ఏది తీసేయాలి లాంటివి కూడా డిసెడ్‌ చేస్తున్నాడట.

అతను హీరోగా పెద్ద రేంజ్‌కి వెళ్లడంతో నిర్మాతలు కూడా అతడిని ఏమీ అనడం లేదట. దీంతో కొత్త దర్శకుడు భరత్‌ కమ్మ బాగా విసిగిపోయాడట. ఏది వుంచుకుంటారో, ఏది తీసేసుకుంటారో మీ ఇష్టం అంటూ ఇప్పటికే పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకి దూరంగా వుంటున్నాడట. దర్శకుడు అలిగి వెళ్లిపోయినా విజయ్‌కి మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదని, తన పనిలో తాను వున్నాడని, అయితే దర్శకుడితో గొడవ పడడం లాంటిది చేయకుండా అతనితో టచ్‌లోనే వుంటున్నాడని, ఎప్పటికప్పుడు వాట్సాప్‌లో అప్‌డేట్స్‌ ఇస్తున్నాడని ఇండస్ట్రీలో చెబుతున్నారు.

విజయ్‌ దేవరకొండతో సినిమా చేస్తే మంచి పేరు వస్తుందనే దాని కంటే అతను తమని పని చెయ్యనివ్వడేమోననే భయం యువ దర్శకులని పట్టుకున్నా ఆశ్చర్యం లేదని అంటున్నారంటే దేవరకొండ జోక్యం హద్దులు దాటిపోయిందన్నమాటే సుమీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English