ఎందుకొచ్చిన హీరోయిజం బాసూ!

ఎందుకొచ్చిన హీరోయిజం బాసూ!

కమెడియన్లు హీరోలుగా చేయడమనేది కొత్తేమీ కాదు. కాకపోతే సదరు కమెడియన్‌కి హీరోలతో సమానమైన పాపులారిటీ వుండాలి. అలా పాపులర్‌ అయిన కమెడియన్లతోనే అడపాదడపా హీరోలుగా సినిమాలు తీసేవారు. కానీ రాన్రానూ ఒక నాలుగు సినిమాల్లో నటించగానే హీరోలుగా కనిపించడం కమెడియన్లకి అలవాటైపోయింది. అలాగే కమెడియన్‌గా మంచి పొజిషన్‌లో వున్న వేణుమాధవ్‌ హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగా కూడా మారి పూర్తిగా దివాళా తీసాడు. ఇప్పుడతనికి కామెడీ వేషాలు కూడా రాని పరిస్థితి.

సునీల్‌ హీరోగా సక్సెస్‌ అయినా కానీ దానికి బ్రేక్‌ ఎక్కడ వేయాలో తెలుసుకోలేక పూర్తిగా ఫేడవుట్‌ అయ్యే వరకు హీరోగా నటిస్తూనే వున్నాడు. అలీ ఒక్కడే హీరోగా ఎన్ని సినిమాలు వచ్చినా కామెడీ వేషాలు మానకుండా కెరియర్‌ కాపాడుకున్నాడు. సునీల్‌ ఉదంతం తెలిసినా కానీ సప్తగిరి ఇప్పుడు హీరోగిరీ కోసం వెంపర్లాడుతున్నాడు. ఇప్పటికే అతడిని పలుమార్లు ప్రేక్షకులు తిరస్కరించారు.

మళ్లీ 'వజ్రకవచధర గోవింద' అంటూ యాక్షన్‌ చేసాడు. తనకి ఏది నప్పుతుందో తెలుసుకోలేక, మిగతా కమర్షియల్‌ హీరోల మాదిరిగా చేసేద్దామని ట్రై చేసి బోర్లా పడ్డాడు. ఈ చిత్రానికి నాసి రకం వసూళ్లు వస్తుండడంతో సప్తగిరికి హీరోగా సీన్‌ లేదని తేలిపోయింది. ఇకనైనా బుద్ధిగా కామెడీ చేస్తాడో లేక మళ్లీ ఎవరైనా హీరోగా అవకాశం ఇచ్చేవరకు చూస్తాడో మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English