హీరోయిన్‌ డామినేషన్‌కి చైతన్య సై!

హీరోయిన్‌ డామినేషన్‌కి చైతన్య సై!

'అ ఆ' చిత్రంలో హీరోగా నాగచైతన్యని తీసుకోవాలని త్రివిక్రమ్‌ భావించాడు. అప్పటికి ఇంకా నాగచైతన్యని పెళ్లి చేసుకోని సమంత కూడా అతడిని ఆ చిత్రంలో నటించేందుకు ఒప్పించడానికి చాలా ట్రై చేసింది కానీ చై ఒప్పుకోలేదు. హీరోయిన్‌ డామినేషన్‌ బాగా వుందని చైతన్య ఆ కథ రిజెక్ట్‌ చేసాడు. తీరా ఆ చిత్రం దాదాపు యాభై కోట్ల షేర్‌ వసూలు చేసింది.

ఆ తర్వాత చైతన్య 'మజిలీ' చిత్రంలో సమంత డామినేటింగ్‌ పర్‌ఫార్మెన్స్‌కి అడ్డు చెప్పలేదు. ఫలితంగా తనకి సోలోగా అతి పెద్ద విజయం నమోదయింది. దీంతో ఇక కథానుసారమే వెళ్లాలి తప్ప పాత్రల పరంగా కొలతలు అనవసరం అని డిసైడయ్యాడు. అందుకే శేఖర్‌ కమ్ములతో ఒక చిత్రం చేయడానికి అంగీకరించాడు. కమ్ముల సినిమాల్లో హీరోయిన్లు డామినేట్‌ చేస్తుంటారనేది తెలిసిందే. అందులోను ఈ చిత్రంలో సాయి పల్లవి నటిస్తుందని అంటున్నారు.

ఫిదా తర్వాత కమ్ముల సినిమాలో ఆమె నటిస్తోందంటే ఖచ్చితంగా ఆ పాత్ర డామినేటింగ్‌గానే వుంటుందని ఫిక్స్‌ అయిపోవచ్చు. అయినా కానీ నాగచైతన్య ఈ చిత్రం చేయడానికి అంగీకరించాడు. మాస్‌ పాత్రలు మానేసి క్లాస్‌ హీరోగానే ఇంకాస్త పరిధి విస్తరించుకోవాలని చూస్తోన్న చైతన్యకి ఇంతకంటే మంచి అవకాశం రాదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English